-
-
Home » Prathyekam » Behead Nupur Sharma for insulting Prophet Muhammad and get my property as reward Ajmer man releases controversial video-MRGS-Prathyekam
-
Nupur Sharma తల నరికితే నా ఆస్తిని బహుమతిగా ఇస్తా... అజ్మేర్ వ్యక్తి వివాదాస్పద వీడియో
ABN , First Publish Date - 2022-07-05T13:02:16+05:30 IST
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మపై రాజస్థాన్ వ్యక్తి వివాదాస్పద వీడియో విడుదల చేశారు....

అజ్మేర్ (రాజస్థాన్): మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మపై రాజస్థాన్ వ్యక్తి వివాదాస్పద వీడియో విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ తల నరికి చంపిన వారికి తన ఇల్లు, ఆస్తులను బహుమతిగా ఇస్తానని రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మేర్ నగరానికి చెందిన ఓ వ్యక్తి వివాదాస్పద వీడియోను విడుదల చేశాడు.వివాదాస్పద వీడియోను విడుదల చేసిన వ్యక్తిని సల్మాన్ చిస్తీగా పోలీసులు గుర్తించారు. నూపుర్ శర్మ తలను ఎవరైనా తీసుకువస్తే తన ఇల్లు, ఆస్తులు ఇస్తానని చెప్పిన వీడియో వైరల్ అయింది. దేశవ్యాప్తంగా ముస్లింలను హింసిస్తున్నారని, హత్యలు చేస్తున్నారని సల్మాన్ చిస్తీ ఆరోపించారు.
వీడియో వైరల్ అయిన తర్వాత అదనపు పోలీసు సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తనకు ఈ వీడియో వాట్సాప్ ద్వారా కూడా అందిందని చెప్పారు. వీడియోలో సల్మాన్ చిస్తీ అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని, తాము దానిని చాలా సీరియస్‌గా తీసుకున్నామని వికాస్ చెప్పారు.ఈ విషయమై అజ్మీర్ పోలీసులు దర్గా, అంజుమన్ అధికారులతో కూడా మాట్లాడారు. నిందితుడు సల్మాన్ చిస్తీ దర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్నాడని, అతడిని త్వరలో అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సాంగ్వాన్ తెలిపారు.
అంతకుముందు జూన్ 28వతేదీన ఉదయ్‌పూర్‌లోని మాల్దాస్ వీధి ప్రాంతంలో కన్హయ్య లాల్ అనే టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు తల నరికి చంపారు. మృతుడు కొన్ని రోజుల క్రితం నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్‌ను పంచుకున్నాడు.మహమ్మద్ ప్రవక్తపై శర్మ, జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో నిరసనలు కూడా చెలరేగాయి.