నాకీ పెళ్లి వద్దంటూ సరిగ్గా ఒక్క రోజు ముందు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన వధువు.. ఆ వరుడి గురించి దారుణ నిజాలు విని..

ABN , First Publish Date - 2022-09-03T20:37:33+05:30 IST

ఆ వ్యక్తికి వివాహం కుదిరింది.. పెళ్లి ముహూర్తం దగ్గరపడుతోంది.. పెళ్లికి ఒక రోజు ముందు వధువు అతడికి షాకిచ్చింది..

నాకీ పెళ్లి వద్దంటూ సరిగ్గా ఒక్క రోజు ముందు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన వధువు.. ఆ వరుడి గురించి దారుణ నిజాలు విని..

ఆ వ్యక్తికి వివాహం కుదిరింది.. పెళ్లి ముహూర్తం దగ్గరపడుతోంది.. పెళ్లికి ఒక రోజు ముందు వధువు అతడికి షాకిచ్చింది.. పెళ్లి చేసుకునేది లేదని (bride called off the Marriage) చెప్పేసింది.. అంతేకాదు వరుడి గురించిన షాకింగ్ విషయాలు బయటపెట్టింది.. ఆ వరుడికి అంతకు ముందే నాలుగు సార్లు వివాహాలు జరిగాయి.. అతను ఏడుగురు పిల్లలకు తండ్రి.. ఆ విషయాలు దాచి పెట్టి అతను మరో  వివాహానికి సిద్ధమయ్యాడు.. మూడో భార్య పిల్లలు వధువును కలిసి మాట్లాడడంతో అసలు విషయం బయటపడింది. 


ఇది కూడా చదవండి..

Haryana: మరో నిర్భయ.. రన్నింగ్ ట్రైన్‌లో కొడుకు ఎదుటే తల్లిపై అత్యాచార యత్నం.. ఆమె ప్రతిఘటించడంతో దారుణం..


ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని కొత్వాలి నగర్ ప్రాంతానికి చెందిన షఫీ అహ్మద్‌ అనే వ్యక్తి ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. అతను ఇప్పటివరకు నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సంతానం లేరనే కారణంతో మొదటి, రెండో భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత తరన్నమ్‌ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది. నాలుగేళ్ల కిందట మూడో భార్యతో కూడా గొడవ పడి ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. అయితే కొన్ని నెలల తర్వాత ఆమెతో రాజీ పడి మరోసారి వివాహం చేసుకున్నాడు. మళ్లీ ఏమైందో ఏమో కొద్ది రోజులుగా తరన్నమ్‌కు దూరంగా ఉంటున్నాడు. 


కుటుంబం గడవడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. వారు ఆరా తీస్తే షఫీ మరో వివాహానికి సిద్ధమవుతున్నాడని తెలిసింది. దీంతో తరన్నమ్ పెద్ద కూతురు అతికా.. తన తండ్రి పెళ్లి చేసుకోబోతున్న మహిళను కలిసింది. ఆమెకు విషయం మొత్తం చెప్పింది. దీంతో ఆ వధువు తన తల్లిదండ్రులకు విషయం చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసింది.  

Read more