నేను గర్భవతిని అయ్యానంటూ ఫోన్ చేసి చెప్పిన ప్రేయసి.. అతడు ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఆమె నిర్ణయమిదీ..!

ABN , First Publish Date - 2022-06-13T20:16:32+05:30 IST

ఆమె కోచింగ్ కోసం అని చెప్పి వేరే ఊరు వెళ్ళింది.. అక్కడ తన అన్నయ్య స్నేహితుడు, ప్రొఫెసర్‌తో ప్రేమలో పడింది..

నేను గర్భవతిని అయ్యానంటూ ఫోన్ చేసి చెప్పిన ప్రేయసి.. అతడు ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఆమె నిర్ణయమిదీ..!

ఆమె కోచింగ్ కోసం అని చెప్పి వేరే ఊరు వెళ్ళింది.. అక్కడ తన అన్నయ్య స్నేహితుడు, ప్రొఫెసర్‌తో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అతడికి శారీరకంగా దగ్గరైంది.. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది.. తాను గర్భం దాల్చినట్టు ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది.. భయపడిన అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేశాడు.. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. తన చావుకు కారణమైన ప్రియుడిని వదలొద్దని సూసైడ్ నోట్‌లో రాసింది. 


ఇది కూడా చదవండి..

ఇలాంటి తండ్రి మాకు అవసరం లేదంటూ 18 ఏళ్ల కుమార్తె ఆవేదన.. ఆమె ఎందుకు ఈ మాటలు అనాల్సి వచ్చిందంటే..


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 27 ఏళ్ల యువతి యూపీఎస్స‌ీ పరీక్షలకు సిద్ధమవుతోంది. కోచింగ్ కోసం రేవాకు వెళ్లింది. తన అన్నయ్య స్నేహితుడు పుష్కరనాథ్ రేవాలో ఓ కోచింగ్ సెంటర్‌లో పని చేస్తుండడంతో అక్కడే జాయిన్ అయింది. క్రమంగా పుష్కరనాథ్‌కు ఆమె క్లోజ్ అయింది. పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో అతడికి శారీరకంగా దగ్గరైంది. కోచింగ్ పూర్తి కావడంతో ఇటీవల తిరిగి ఇండోర్ వెళ్లిపోయింది. అక్కడ తాను గర్భవతినని తెలుసుకుంది. వెంటనే ఆ విషయాన్ని పుష్కరనాథ్‌కు ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాతి నుంచి పుష్కరనాథ్ ఆమెకు అందుబాటులో లేకుండాపోయాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేశాడు. 


పుష్కరనాథ్ తనను మోసం చేసినట్టు భావించిన యువతి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తన చావుకు పుష్కరనాథ్ కారణమని, అతడికి శిక్ష పడాలని సూసైడ్ నోట్‌లో రాసింది. ఆ యువతి సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు పుష్కరనాథ్‌ను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-06-13T20:16:32+05:30 IST