chanakya niti: ఉత్తమ నాయకునికి ఉండాల్సిన లక్షణాలివే..

ABN , First Publish Date - 2022-11-14T09:01:47+05:30 IST

చాణక్య నీతిని జ్ఞాన బాంఢాగారమని అంటారు. ఆచార్య చాణక్యుడు రూపొందించిన విధానాలు అసంఖ్యాకమైన యువతీ యువకులకు మార్గనిర్దేశం చేశాయి. భవిష్యత్తులోనూ ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయి.

chanakya niti: ఉత్తమ నాయకునికి ఉండాల్సిన లక్షణాలివే..

చాణక్య నీతిని జ్ఞాన బాంఢాగారమని అంటారు. ఆచార్య చాణక్యుడు రూపొందించిన విధానాలు అసంఖ్యాకమైన యువతీ యువకులకు మార్గనిర్దేశం చేశాయి. భవిష్యత్తులోనూ ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయి. విజయానికి సంబంధించిన అనేక రహస్యాలు ఆచార్యుని విధానాల్లో దాగి ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాణక్య విధానాన్ని చదివేవారు అనేకమంది ఉన్నారు. కౌటిల్యుడు రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, దౌత్యశాస్త్రంలో మాత్రమే నిపుణుడు కాదు. చాణక్యుడు జీవితంలోని ముఖ్యమైన విషయాలలో వివరణాత్మక జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నాడు.

చాణక్యుని చొరవతో చంద్రగుప్త మౌర్య మగధలో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన నాయుకుడు కావడానికి ఉండాల్సిన అనేక లక్షణాల గురించి చెప్పాడు. చాణక్య నీతిలో పేర్కొన్న వివరాల ప్రకారం సమర్ధవంతమైన నాయకునిగా మారడానికి ఏ విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రణాళికాబద్ధంగా పనిని పూర్తి చేయడానికి ఓపిక ఎంతో ముఖ్యం. తొందరపాటుతో చేసే పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకే సహనం మరియు స్వీయ నియంత్రణల సహవాసాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. సమర్థుడైన వ్యక్తి తన ప్రత్యర్థులకు తన ప్రణాళికల గురించి ఎప్పుడూ వెల్లడించడు. ప్రణాళికలను ఇతరులతో చర్చించడం ఓటమికి దారితీస్తుంది. అందుకే ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. అలాగే మీ బృంద సభ్యులు కూడా అలా చేయకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. సమర్థుడైన వ్యక్తి తాను అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేసే వరకు అప్రమత్తంగా ఉండాలి. దీనితో పాటు, అతను తన జట్టులోని ప్రతి సభ్యుని నుండి సలహాలను కూడా తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పనిలో సృజనాత్మకత పెరిగి, విజయానికి అవకాశాలు ఏర్పడతాయి.

Updated Date - 2022-11-14T09:03:29+05:30 IST