బ్యాంక్ మేనేజర్‌కే టోకరా.. పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.40 లక్షలు లోన్.. చివరకు..
ABN , First Publish Date - 2022-04-15T19:39:49+05:30 IST
అతను ఒక బార్ యాజమాని.. లావాదేవీల నిమిత్తం తరచుగా బ్యాంకుకు వెళ్లేవాడు..

అతను ఒక బార్ యాజమాని.. లావాదేవీల నిమిత్తం తరచుగా బ్యాంకుకు వెళ్లేవాడు.. ఈ క్రమంలో ఆ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌తో పరిచయం పెంచుకున్నాడు.. తరచుగా ఆమెను కలిసేవాడు.. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమెను ప్రేమలోకి దించాడు.. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. ఆమె ద్వారా రూ.40 లక్షల లోన్ శాంక్షన్ చేయించుకున్నాడు.. చివరకు అసలు విషయం తెలియడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఇండోర్‌లోని ఒక బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న 40 ఏళ్ల మహిళ 2018లో తన భర్త నుంచి విడిపోయింది. ఆమెకు పదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఆమె పని చేసే బ్యాంక్‌కు బార్ యజమాని కౌస్తుబ్ తరచుగా వెళ్లేవాడు. బాధిత మహిళతో పరిచయం పెంచుకుని ప్రేమలోకి దించాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె ద్వారా రూ.40 లక్షల లోన్ శాంక్షన్ చేయించుకున్నాడు.
ఆ మహిళ పెళ్లి గురించి మాట్లాడినప్పుడల్లా ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని చెప్పి తప్పించుకునేవాడు. ఇటీవల గట్టిగా నిలదీస్తే ఆమెకు కనిపించడం మానేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కౌస్తుబ్పై అత్యాచారం కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.