babies without womb: వామ్మో పిల్లలను మెషిన్ లలో ఉత్పత్తి చేస్తున్నారు.. మొదట్లోనే 30వేల మంది పిల్లలట.. దిమ్మతిరిగిపోయే టెక్నాలజీ..

ABN , First Publish Date - 2022-12-16T13:59:50+05:30 IST

ఆడవాళ్ళతో అవసరమే లేకుండా పిల్లలను యంత్రాల సహాయంతో ఉత్పత్తి చేస్తున్నారు.

babies without womb: వామ్మో పిల్లలను మెషిన్ లలో ఉత్పత్తి చేస్తున్నారు.. మొదట్లోనే 30వేల మంది పిల్లలట.. దిమ్మతిరిగిపోయే టెక్నాలజీ..

రోబో సినిమాలో రజనీకాంత్ రోబోలను తయారు చేయడం చూసినపుడు అదంతా కొత్తగా.. వింతగా అనిపించింది. ప్రజలు విరగబడి చూసారు. అయితే అదంతా సినిమా మాత్రమే కాకుండా రోబో అనేది యాంత్రిక వ్యవస్థ. కానీ పిండం ఏర్పడటం, దాని ఎదుగుదల ఆడవారి గర్భంలో తప్ప సాధ్యం కాదు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళతో అవసరమే లేకుండా పిల్లలను యంత్రాల సహాయంతో ఉత్పత్తి చేస్తున్నారు. దిమ్మతిరిగిపోయే ఈ కొత్త ఆవిష్కరణకు సంబంధించి వివరాలలోకి వెళితే..

హషేమ్ అల్-ఘైలీ అనే వ్యక్తి సినీ నిర్మాత. కేవలం నిర్మాత మాత్రమే కాదు శాస్త్రవేత్త కూడా. ఈయన మహిళల గర్భం అవసరం లేకుండా బేబీ పాడ్ సహాయంతో పిల్లలను ఉత్పత్తి చేయవచ్చని చెబుతున్నాడు. దీనికోసం 'ఎక్టోలైఫ్' అనే సంస్థను కూడా నెలకొల్పాడు. పిల్లలను కృత్రిమంగా ఉత్పత్తి చేయడానికి ఇతను చెబుతున్న యంత్రం బేబి పాడ్. బేబి పాడ్.. అంటే ఏంటి?? ప్రకృతి సహజంగా మహిళల గర్భంలో పెరిగే వ్యవస్థను సవాలు చేసే ఈ యంత్రాల సామర్థ్యం ఎంత?? వీటి ద్వారా పొందే ఫలితాలు ఎంత మొదలైన వాటి గురించి తెలుసుకుంటే..

womb.gif

ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే సరోగసీ, టెస్ట్ ట్యూబ్ వంటి గర్భధారణ సౌకర్యాలను ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. ఎన్ని రకాల కొత్త మార్గాలు కనిపెట్టినా పిండం ఆడవారి గర్భంలో పెరగవలసిందే.. కానీ ఆడవారి గర్భాన్ని ఛాలెంజ్ చేస్తూ పిల్లలను ఉత్పత్తి చేసే మెషిన్ లను ఆవిష్కరించారు. బేబి పాడ్ గా చెప్పుకునే ఈ రకమైన మిషన్ ల వల్ల పిల్లలను ఉత్పత్తి చేయడమే కాదు, పిల్లల జెండర్ నుండి చర్మం రంగు, జుట్టురంగు, కళ్ళు ఎలా ఉండాలి, పిల్లల ఐక్యూ లెవల్స్, పిల్లల ఎత్తు శారీరకంగా పిల్లలు ఎంత బరువు ఉండాలి వంటి విషయాలు కావలసినట్టు ఎంపిక చేసుకోవచ్చట.

మొత్తం 75 ల్యాబ్ లలో 400 బేబీ పాడ్ ల సహాయంతో 30వేల మంది పిలల్లలను ఉత్పత్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయని ఘైలీ తెలిపారు. బేబీ పాడ్ లో బిడ్డ ఎదుగుదలను ప్రత్యక్షంగా పరిశీలించే సదుపాయం ఉందట. మొదటగా పురుషుడి వీర్యాన్ని మహిళ అండాలతో కలుపుతారు. తరువాత వీటిని యంత్రంలో ప్రవేశపెడతారు. అప్పుడు ఈ బేబి పాడ్ యంత్రం అచ్చం మహిళ గర్భం లాగే పనిచేయడం మొదలుపెడుతుంది. మహిళ గర్భంలో ఉండే ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులు ఈ బేబి పాడ్ లో కూడా కల్పించబడతాయట. దీనికారణంగా బిడ్డ ఎదుగుదల తల్లి గర్భంలో జరిగినట్టుగానే ఉంటుందని తెలిపారు. ఇంకా ఇందులో బిడ్డ ఎదుగుదలలో ఒకో దశలో ఒకో అవయవం ఏర్పడటం కూడా ఎప్పటికప్పుడు గమనించవచ్చట.

womb3.gif

సౌత్ కొరియా, జపాన్, బల్గేరియా వంటి దేశాలలో జనాభా క్రమంగా తగ్గిపోతున్న క్రమంలో అక్కడ జనాభా పెరుగుదలకు దోహదపడేవిధంగా ఈ పద్దతి చాలా ఉపయోగపడుతుందట. మరీ ముఖ్యంగా భార్యా భర్తలిద్దరిలో పిల్లలు కలగడానికి ఇబ్బందులున్నప్పుడు, ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటం కోసం ఈ పద్దతి ఎంతగానో ఉపయోగకరమని ఘైలీ చెబుతున్నారు.

అయితే ఇలా కృత్రిమ పద్దతిలో పిల్లలను ఉత్పత్తి చేయడం, అందులోనూ లింగాన్ని ఇతర అంశాల్ని ఎంచుకుని మరీ పిల్లలను పొందడం చాలా ప్రమాదకరమైన పరిణామమని, దీనివల్ల స్త్రీ-పురుష నిష్పత్తి విషయంలో చాలా వ్యత్యాసం చోటుచేసుకుంటుందని అంటున్నారు.

మహిళ గర్భంలో ఉన్నట్టుగా ఎన్ని పరిస్థితులు కల్పించినా తల్లికి, బిడ్డకు మద్య ఏర్పడే అనుబంధం ఈ మెషిన్ లలో సాధ్యమవుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Updated Date - 2022-12-16T14:51:34+05:30 IST