-
-
Home » Prathyekam » Atta costs Rs 100 per litre Imran Khan comment gets trolling sgr spl-MRGS-Prathyekam
-
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు.. లీటర్ గోధుమ పిండి ధర రూ.100 అంటూ..
ABN , First Publish Date - 2022-09-17T23:04:09+05:30 IST
అనూహ్య పరిస్థితుల్లో పాకిస్థాన్ (Pakisthan) ప్రధాని పీఠాన్ని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఇటీవల తన విమర్శలకు పదును పెట్టారు

అనూహ్య పరిస్థితుల్లో పాకిస్థాన్ (Pakistan) ప్రధాని పీఠాన్ని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఇటీవల తన విమర్శలకు పదును పెట్టారు. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తుత అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రోజు రోజుకూ దిగజారిపోతున్న దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ఓ వ్యాఖ్య విమర్శలకు కారణమైంది. ఇమ్రాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
పాకిస్థాన్‌లో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం గురించి తాజాగా ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. సామాన్యులు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారని, గోధుమ పిండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని అన్నారు. ప్రస్తుతం కరాచీలో(Karachi) లీటరు గోధుమ పిండి ధర రూ.100 పైనే ఉందని (Atta costs Rs 100 per litre) వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గోధుమ పిండిని లీటర్లలో కొలుస్తున్న ఇమ్రాన్.. `పాకిస్థాన్ పప్పు` అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి చిన్న విషయాలు కూడా తెలియకుండా ఆయన దేశానికి ప్రధానమంత్రి ఎలా అయ్యారో అని మరికొందరు సెటైర్లు వేశారు.