4 Cough Syrups: దగ్గు వస్తోందని ఈ 4 సిరప్‌లను వాడుతున్నారా..? తాజాగా WHO చేసిన హెచ్చరిక ఏంటంటే..!

ABN , First Publish Date - 2022-10-06T17:16:51+05:30 IST

డాక్టర్స్ రాసి ఇచ్చే దగ్గుమందులో ఎక్కువ డోస్ తీసుకుంటే నిద్ర ముంచుకొస్తుంది. దీనికోసం కూడా దగ్గుమందును ఎక్కువగా వాడేవారున్నారు.

4 Cough Syrups: దగ్గు వస్తోందని ఈ 4 సిరప్‌లను వాడుతున్నారా..? తాజాగా WHO చేసిన హెచ్చరిక ఏంటంటే..!

దగ్గుమందుని మనలో చాలామంది వాడుతూ ఉంటాం. వీటిలో చాలా రకాలే ఉన్నాయ్. ఈ టానిక్స్ తీవ్రమైన దగ్గును తగ్గించి, వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఇళ్ళల్లోనూ దగ్గుమందు తప్పని సరిగా ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు డాక్టర్స్ రాసి ఇచ్చే దగ్గుమందులో ఎక్కువ డోస్ తీసుకుంటే నిద్ర ముంచుకొస్తుంది. దీనికోసం కూడా దగ్గుమందును ఎక్కువగా వాడేవారున్నారు. అయితే భారత కంపెనీకి చెందిన 4 సిరప్‌లకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిక జారీ చేసింది. గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి ఈ సిరప్‌లే కారణమని WHO తెలిపింది.


ఈ దగ్గు సిరప్‌లను తయారు చేసే హర్యానాలోని ఫార్మాస్యూటికల్ కంపెనీతో భారత ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. డీజీసీఐ హర్యానా డ్రగ్స్ రెగ్యులేటరీ నుంచి వివరణాత్మక నివేదికను కూడా కోరింది. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 


1. గాంబియాకు సిరప్ పంపిన భారతీయ కంపెనీ ఏది?

సోనెపట్‌కు చెందిన మాడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీ సిరప్‌ను గాంబియాకు మాత్రమే పంపిందని, అయితే ఇప్పటి వరకు కంపెనీ దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.


2. సిరప్‌లు ఏదైనా ఇతర దేశానికి పంపించారా?

ఈ సిరప్‌ను ఇతర ఆఫ్రికా దేశాలకు కూడా రవాణా చేసే అవకాశం ఉందని WHO తెలిపింది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయాలి, లేకపోతే ప్రమాదం పెరుగుతుంది.


3. WHO మెడికల్ రిపోర్ట్‌లో ఏముంది?

66 మంది పిల్లలు మరణించిన తర్వాత, WHO ఈ ఔషధాన్ని పరీక్షించింది. ప్రయోగశాల పరీక్షల సమయంలో, అధిక మొత్తంలో డైథైలిన్ గ్లైకాల్ , ఇథిలీన్ గ్లైకాల్ కనుగొన్నారు. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత, WHO ప్రతినిధి మాట్లాడుతూ, దగ్గు సిరప్ తాగడం వల్ల తీవ్రమైన మూత్రపిండాల వ్యాధితో పిల్లలు చనిపోయే అవకాశం ఉందని చెప్పారు.


4. ఏ నాలుగు సిరప్‌లకు హెచ్చరిక జారీ చేశారు?

Promethazine ఓరల్ సొల్యూషన్, Cofaxmalin బేబీ దగ్గు సిరప్, Macoff బేబీ దగ్గు సిరప్ మరియు Magrip N కోల్డ్ సిరప్.


5. గాంబియా ఎక్కడ ఉంది?

గాంబియా పశ్చిమ ఆఫ్రికాలోని దేశం. ఇది సెనెగల్‌తో ఉత్తర, తూర్పు, దక్షిణ సరిహద్దులను పంచుకుంటుంది. దీని జనాభా 17 లక్షలు. ఇది బ్రిటన్ నుండి 18 ఫిబ్రవరి 1965న స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశ రాజధాని బంజుల్, కానీ అతిపెద్ద నగరం సెరికుండ.


భారత్ లో తయారు చేసిన దగ్గు సిరప్ లపై డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరిక తర్వాత డ్రగ్స్ బోర్డ్ విచారణకు ఆదేశించింది. భారత్ లో తయారు చేసిన నాలుగు దగ్గు సిరప్ లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిక జారీ చేయడంతో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గమైజేషన్ దర్యాప్తు ప్రారంభించింది. 


జలుబు, దగ్గు సిరప్ లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన తరువాత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) దర్యాప్తు ప్రారంభించింది. గాంబియా ఉత్పత్తి చేసి ఎగుమతి చేసిన దగ్గు, జలుబు సిరప్ లపై వివరణాత్మక దర్యాప్తుకు ఆదేశించింది.


భారత ప్రభుత్వం ఏం అంటుంది..

ఒక ప్రకటనలో ప్రభుత్వం ఇలా పేర్కొంది..

పరీక్ష ఫలితాలు.. WHO అందుకున్న తాత్కాలిక ఫలితాల ప్రకారం, పరీక్షించిన 23 నమూనాలలో, నాలుగు నమూనాలలో డైథైలిన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు కనుగొనబడింది. డబ్ల్యూహెచ్‌ఓ ద్వారా అనాలిసిస్ సర్టిఫికేట్ సమీప భవిష్యత్తులో డబ్ల్యూహెచ్‌ఓకి అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. కలుషితమైన ఉత్పత్తులు ఇప్పటివరకు గాంబియాలో మాత్రమే కనుగొనబడినప్పటికీ, అవి ఇతర దేశాలకు పంపిణీ చేసి ఉండవచ్చునని WHO చీఫ్ చెప్పారు. రోగులకు హాని కలిగించకుండా అన్ని దేశాలు ఈ ఉత్పత్తులను గుర్తించి పంపిణీని ఆపేయాలని WHO తెలిపింది.


ఈ టాక్సిక్ ఎఫెక్ట్స్ తో పొత్తికడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్ర విసర్జన చేయలేకపోవడం, తలనొప్పి, మానసిక గందరగోళం మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. దీనితో మరణానికి దారితీయవచ్చు. ఈ ఉత్పత్తులను బ్యాచ్ లను నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ విశ్లేషింంచే వరకు సురక్షితం కాదని తెలిపింది. ముఖ్యంగా పిల్లలు వినియోగిస్తే మరణం వరకూ దారి తీయవచ్చునని తెలిపింది. కాబట్టి తగ్గుమందుతో తస్మాత్ జాగ్రత్త...

Read more