Viral Video: అద్భుతం.. స్కూటర్‌ను ఇలా కూడా వాడొచ్చా.. Anand Mahindra ఫిదా!

ABN , First Publish Date - 2022-12-06T19:10:53+05:30 IST

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన వీడియోలను అందరితో పంచుకుంటారు. తనకు నచ్చిన ఐడియాలను తప్పకుండా ప్రశంసిస్తారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో చూసి స్కూటర్‌ను ఇలా కూడా వాడొచ్చా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: అద్భుతం.. స్కూటర్‌ను ఇలా కూడా వాడొచ్చా.. Anand Mahindra ఫిదా!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన వీడియోలను ట్విటర్ ద్వారా అందరితో పంచుకుంటారు. తనకు నచ్చిన ఐడియాలను తప్పకుండా ప్రశంసిస్తారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో అద్భుతమైన క్రియేటివిటీతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చూసి స్కూటర్‌ను ఇలా కూడా వాడొచ్చా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఆ వీడియోలో.. ఓ వ్యక్తి నిర్మాణ భవనం వద్ద సిమెంట్ బస్తాలను పై అంతస్థుకు పంపడానికి స్కూటర్‌ను ఉపయోగించాడు. స్కూటర్ మోటారును ఉపయోగించి తాడు సహాయంతో సిమెంట్ బస్తాలను పై అంతస్థుకు పంపించాడు. ఆ ఆలోచన వల్ల చాలా ఖర్చు, శ్రమ తగ్గిపోతోంది. ఆ ఆలోచనను ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. వీటిని పవర్ ట్రైన్స్ అని పిలుస్తారు. వాహనాల ఇంజిన్‌ల శక్తిని అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. వాటిల్లో ఇది మరింత మెరుగ్గా ఉందని ఆనంద్ కామెంట్ చేశారు.

Updated Date - 2022-12-06T19:10:55+05:30 IST