Anand Mahindra: ఈ మ్యారేజ్ హాల్ ఐడియా అదుర్స్.. ఆసక్తికర వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా

ABN , First Publish Date - 2022-09-26T00:58:15+05:30 IST

తనకు నచ్చిన ఆలోచనలను, సృజనాత్మక వీడియోలను తరచుగా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి

Anand Mahindra: ఈ మ్యారేజ్ హాల్ ఐడియా అదుర్స్.. ఆసక్తికర వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా

తనకు నచ్చిన ఆలోచనలను, సృజనాత్మక వీడియోలను తరచుగా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి అందరికీ తెలిసేలా చేస్తుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). ఫన్నీ వీడియోలు, ఆసక్తికర వీడియోలను తరచుగా పోస్ట్ చేసే ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ పోర్టబుల్ మ్యారేజ్ హాల్‌కు (portable marriage hall) సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిని డిజైన్ చేసిన వ్యక్తిని కలవాలనుకుంటున్నట్టు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.


వాహనాలను తీసుకెళ్లే పెద్ద ట్రక్‌ను మ్యారేజ్‌ హాల్‌గా తీర్చిదిద్దిన తీరుకు ఆనంద్ ఫిదా అయ్యారు. 40 అడుగుల పొడవు కలిగిన షిప్పింగ్ కంటైనర్‌ను అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్‌తో మోడ్రన్ కల్యాణ వేదికగా మార్చారు. ప్రస్తుత మ్యారేజ్ హాల్స్‌కు ఏ మాత్రం తీసిపోని రీతిలో 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏసీ హాలు, భోజన వసతులతో దాన్ని రూపొందించారు. ఈ పోర్టబుల్ మ్యారేజ్ హాల్‌లో సుమారు 200 మంది అతిథులతో అద్భుతంగా వివాహ వేడుకను నిర్వహించుకోవచ్చు. దీనిని ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకెళ్లవచ్చు. అంతేకాదు వర్షా కాలంలో బహిరంగ వివాహ వేదికలతో పోల్చుకుంటే తమది ఎంతో మేలని రూపకర్తలు చెబుతున్నారు. 

Read more