మేనమామ లేని సమయంలో మాత్రమే ఇంటికి వెళ్లే యువకుడు.. ఓ రోజు మామతో పాటూ గంగా నది ఒడ్డుకు వెళ్లగా.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-24T23:35:57+05:30 IST

20ఏళ్ల ఓ యువకుడు మేనమామ భార్యతో ప్రేమ వ్యవహారం (love affair) నడిపించాడు. మామలేని సమయంలో ఇంట్లోకి వెళ్తుండేవాడు. చివరకు ఆనోటా, ఈనోటా పడి ఈ విషయం మామకు..

మేనమామ లేని సమయంలో మాత్రమే ఇంటికి వెళ్లే యువకుడు.. ఓ రోజు మామతో పాటూ గంగా నది ఒడ్డుకు వెళ్లగా.. చివరకు ఏం జరిగిందంటే..

20ఏళ్ల ఓ యువకుడు మేనమామ భార్యతో ప్రేమ వ్యవహారం (love affair) నడిపించాడు. మామలేని సమయంలో ఇంట్లోకి వెళ్తుండేవాడు. చివరకు ఆనోటా, ఈనోటా పడి ఈ విషయం మామకు తెలిసింది. దీంతో ఓ రోజు మేనల్లుడితో ప్రేమగా మాట్లాడుతూ గంగానది ఒడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ అతడు చేసిన నిర్వాకం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. చివరకు పోలీసు విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బీహార్ (Bihar) రాష్ట్రం బక్సర్‌ పరిధికి చెందిన రవీంద్ర యాదవ్.. భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. కైతి పంచాయతీ పరిధికి చెందిన సోనుకుమార్‌కు రవీంద్ర యాదవ్.. మేనమామ అవుతాడు. దీంతో తరచూ మేనమామ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఈ క్రమంలో మేనమామ భార్యతో చనువుగా ఉండేవాడు. క్రమంగా వీరి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. అప్పటి నుంచి మామ లేని సమయంలో మాత్రమే ఇంటికి వెళ్లేవాడు. ఇలా రవీంద్ర యాదవ్‌కు తెలీకుండా ప్రేమ వ్యవహారం నడిపించేవారు. కొన్నాళ్లకు ఈ విషయం రవీంద్రకు తెలిసింది. అప్పటినుంచి మేనల్లుడిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతమొందిచాలని కుట్రపన్నాడు.

Wife's shocking plan: నా భర్తను చంపేశారా! అంటూ కిల్లర్లకు భార్య ఫోన్.. చంపేంత ధైర్యం లేక.. చివరకు భర్తతో కలిసి వారు ఆడిన డ్రామాతో..


ఆగస్టు 13న మేనల్లుడితో ప్రేమగా మాట్లాడుతూ సమీపంలోని గంగా నది ఒడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా అతడిపై దాడికి పాల్పడి, హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని (dead body) నదిలో పడేశాడు. సోను కుమార్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు దియారాంచల్‌ ప్రాంతంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రవీంద్ర యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అప్పటిదాకా ఆడుకుంటున్న బాలిక.. ఆ మరుక్షణమే అపస్మారక స్థితిలో.. నోటికి ఖర్చీప్ అడ్డుపెట్టి మరీ చివరకు..Read more