కన్నతల్లిని రాత్రి పూట నడిరోడ్డు మీద వదిలేసిన తండ్రికి.. కలలో కూడా ఊహించని షాకిచ్చిన కొడుకు.. ఆ మనవడికి హ్యాట్సాఫ్..!

ABN , First Publish Date - 2022-09-29T01:15:33+05:30 IST

ఆర్థిక సమస్యల కారణంగా తల్లిని పోషించలేక నిర్ధాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన మధ్యప్రదేశ్ ఇండోర్ వ్యక్తికి తన కొడుకు షాకిచ్చాడు. పాన్ దుకాణాన్ని నడిపే రామేశ్వర్ ప్రజాపత్..

కన్నతల్లిని రాత్రి పూట నడిరోడ్డు మీద వదిలేసిన తండ్రికి.. కలలో కూడా ఊహించని షాకిచ్చిన కొడుకు.. ఆ మనవడికి హ్యాట్సాఫ్..!

ఆర్థిక సమస్యల కారణంగా తల్లిని పోషించలేక నిర్ధాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన మధ్యప్రదేశ్ ఇండోర్ వ్యక్తికి తన కొడుకు షాకిచ్చాడు. పాన్ దుకాణాన్ని నడిపే రామేశ్వర్ ప్రజాపత్.. వంద సంవత్సరాల వయసున్న తన తల్లిని శనివారం రాత్రి రోడ్డుపై వదిలివెళ్లిన ఘటన.. అందరినీ కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే. రోడ్డుపై దీనస్థితిలో ఉన్న వృద్ధురాలిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై ప్రజాపత్‌కు అతని కొడుకు కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ మనువడికి హ్యాట్సాఫ్ అంటూ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌కు చెందిన 100ఏళ్ల వృద్ధురాలికి (Indoor old woman) 60ఏళ్ల ఒకే ఒక్క రామేశ్వర్ ప్రజాపత్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. అంతా కలిసి ఉండేవారు. రామేశ్వర్ ప్రజాపత్ పాన్ దుకాణాన్ని నడుపుతూ ఉండేవాడు. అయితే లాక్‌డౌన్‌ తర్వాత వారి ఆర్థిక కష్టాలు (Financial difficulties) తీవ్రమయ్యాయి. దీంతో రామేశ్వర్ కొడుకులు.. వృద్ధురాలిని తమ వద్ద ఉంచుకునేందుకు ఇష్టపడలేదు. కొడుకుల నుంచి ఒత్తడి ఒకవైపు, మరోవైపు ఆర్థిక సమస్యలతో చివరకు తల్లిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. శనివారం రాత్రి 10.30కి తల్లిని ఎత్తుకెళ్లాడు. తల్లి అనే కనికరం కూడా లేకుండా నడి రోడ్డులో వదిలేసి వచ్చాడు.

RS.16 Crore Injection: ఆ ఒక్క ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు.. ఈ 20 నెలల బాలుడు బతకాలంటే మరో 4 నెలల్లోనే..


రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపిన వృద్ధురాలిని.. స్థానికులు గమనించారు. పోలీసులకు అక్కడికి చేరుకుని ఆమెను వృద్ధాశ్రమానికి తరలించారు. విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వృద్ధురాలిని నిర్ధాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేసిన ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోలు వైరల్ (Viral videos) అవవడంతో రామేశ్వర్ కొడుకు విక్కీ కంటపడింది. ఈ వీడియో చూడగానే అతడి హృదయం చలించిపోయింది. వెంటనే వృద్ధాశ్రమ నిర్వాహకులకు ఫోన్ చేసి మాట్లాడాడు. సోమవారం రామేశ్వర్ ప్రజాపత్‌తో పాటూ ముగ్గురు కొడుకులు అక్కడికి వెళ్లారు. పోలీసుల సమక్షంలో వృద్ధురాలిని బాగా చూసుకుంటామని అగ్రిమెంట్ రాయించి విక్కీ.. తండ్రితో కూడా సంతకాలు చేయించాడు.

instagram friends: ప్రేమికుల మధ్య ఇన్‌స్టా ‘‘స్నేహితుల’’ సమస్య.. వారిని వదులుకునే ప్రసక్తే లేదంటూ ప్రియురాలు చెప్పింది వినగానే..


ఈ ఘటనపై రామేశ్వర్ మాట్లాడుతూ తన తల్లి పట్ల దారుణంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నట్లు కన్నీటిపర్యంతమయ్యాడు. మనువళ్లు మాట్లాడుతూ..  నానమ్మ అంటే తమకు చాలా ఇష్టమని, అయితే తండ్రితో గొడవల కారణంగా ఆమెను చూసుకోలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వృద్ధురాలి సంరక్షణ బాధ్యతలను ఆమె మనువడి విక్కీ చూసుకున్నాడు. వారి ఇంటికి తీసుకెళ్లిన విక్కీ.. అతడి భార్య, పిల్లలు... దగ్గరుండి మరీ వృద్ధురాలికి సేవలు చేస్తున్నారు. మొత్తానికి తప్పు తెలుసుకుని వృద్ధురాలి ఇంటికి తీసుకెళ్లిన.. ఆమె మనువడిని అంతా అభినందిస్తున్నారు. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దంటూ రామేశ్వర్ కుటుంబ సభ్యులకు సూచిస్తున్నారు.

King Cobra video: అది కోబ్రా అనుకున్నావా.. లేక జీబ్రా అనుకున్నావా.. మరీ ఇలా ఆడుకుంటున్నావేంట్రా..Read more