Amitabh Bachchan: చివరకు తల్లి చనిపోయిన రోజు కూడా అమితాబ్ వెంటే.. ఎప్పుడూ బిగ్ బీ పక్కనే కనిపించే ఈ వ్యక్తి కథేంటంటే..?

ABN , First Publish Date - 2022-10-08T02:41:03+05:30 IST

అమితాబ్ బచ్చన్.. భారత్‌లోనే అతి పెద్ద సూపర్ స్టార్. దాదాపు 50 ఏళ్లుగా ఇండియన్ సినిమాపై వెలుగుతున్న రారాజు.

Amitabh Bachchan: చివరకు తల్లి చనిపోయిన రోజు కూడా అమితాబ్ వెంటే.. ఎప్పుడూ బిగ్ బీ పక్కనే కనిపించే ఈ వ్యక్తి కథేంటంటే..?

అమితాబ్ బచ్చన్.. భారత్‌లోనే అతి పెద్ద సూపర్ స్టార్. దాదాపు 50 ఏళ్లుగా ఇండియన్ సినిమాపై వెలుగుతున్న రారాజు. `కౌన్ బనేగా కరోడ్‌పతి` అంటూ బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్న అమితాబ్‌ తన వ్యక్తిగత సిబ్బందితో ఎంతో అనుబంధం కలిగి ఉంటారు. అలాంటి వారిలో దీపక్ సావంత్ ఒకరు. ఆయన అమితాబ్ మేకప్ మ్యాన్. అమితాబ్‌‌తో ఎల్లప్పుడూ కనిపించే దీపక్ గత 48 ఏళ్లుగా మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నారు. `జంజీర్` నుంచి ఇప్పటివరకు అమితాబ్ వెన్నెంటే ఉన్న దీపక్ ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదట. 


ఇది కూడా చదవండి..

Skull in Jar: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 181 ఏళ్లుగా ఓ జాడీలో అతడి తలను భద్రంగా దాచేశారిలా.. ఇంతకీ ఇతడెవరంటే..


తన తల్లి మరణించిందనే వార్త తెలిసినా దీపక్ ఇంటికి వెళ్లలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత అమితాబ్ బచ్చన్ మేకప్ తీసేసి సాయంత్రం నాలుగు గంటలకు దీపక్ అమ్మను చూసేందుకు ఇంటికి వెళ్లాడట. ఆ ఘటన గురించి దీపక్ మాట్లాడుతూ.. `నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చానో మా అమ్మకు తెలుసు. పని కంటే ఇంకేదీ ఎక్కువ కాదని మా అమ్మ తరచుగా చెబుతుండేద`ని దీపక్ చెప్పారు. రోజుకు ఒక్క రూపాయి సంపాదనతో కెరీర్ ప్రారంభించిన దీపక్ ప్రస్తుతం రోజుకు రూ.50 వేలు తీసుకుంటున్నారు. అమితాబ్ కంటే ముందు దిలీప్ కుమార్, రాజేష్ కన్నా వంటి సూపర్‌స్టార్లకు దీపక్ మేకప్ వేశారు. 


ఆ తర్వాత అమితాబ్ వ్యక్తిగత మేకప్ మ్యాన్‌గా మారి ఇప్పటివరకు ఆయన దగ్గరే పని చేస్తున్నారు. మధ్యలో అమితాబ్ రాజకీయాల్లోకి వెళ్లాక కొన్ని రోజులు స్మితా పాటిల్ దగ్గర చేరారు. దీపక్ మేకప్ వేస్తేనే కమర్షియల్ సినిమాలు చేస్తానని అప్పట్లో స్మితా పాటిల్ పట్టుబట్టేవారు. స్మితా పాటిల్ చనిపోయిన తర్వాత దీపక్ మళ్లీ అమితాబ్ దగ్గరకు చేరారు.

Updated Date - 2022-10-08T02:41:03+05:30 IST