-
-
Home » Prathyekam » Amazing stunt video went viral police caught the biker and imposed a fine of Rs 4200 sgr spl-MRGS-Prathyekam
-
Viral Video: రద్దీ రోడ్డుపై బైక్‌తో వెరైటీ స్టంట్స్.. పోలీసుల కంటపడిన వైరల్ వీడియో.. చివరకు అతడి పరిస్థితి ఎలా తయారయిందంటే..
ABN , First Publish Date - 2022-09-25T20:37:58+05:30 IST
సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవాలనే తపనతో చాలా మంది సాహసాలు చేస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు

సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవాలనే తపనతో చాలా మంది సాహసాలు చేస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ రోడ్లపై బైక్‌లతో చేసే స్టంట్ల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి రద్దీ రోడ్డుపై బైక్ స్టంట్ చేశాడు.
ఓ యువకుడు కళ్లద్దాలు పెట్టుకుని, రెడ్ క్యాప్ వేసుకుని బైక్‌పై పూర్తిగా ఒకవైపే కూర్చుని డ్రైవ్ చేశాడు. తన స్టంట్‌ను వీడియో తీయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్ (Viral Video) అయి పోలీసుల వరకు వెళ్లింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిని పట్టుకుని రూ.4200 జరిమానా విధించారు. అంతేకాదు చెవి పట్టుకుని గుంజీలు కూడా తీయించారు. అతడి చేత క్షమాపణ చెప్పించారు. ఛత్తీస్‌గఢ్‌లో దుర్గ్‌లో ఈ ఘటన జరిగింది.