రోడ్డుపై ఆహారం విక్రయిస్తున్న ఈ అందమైన అమ్మాయి ఎవరంటే...

ABN , First Publish Date - 2022-10-31T07:41:56+05:30 IST

అమన్ హుండల్ అనే అందమైన యువతి రోడ్డు పక్కన ఆహారం విక్రయిస్తోంది. ఈమెకు సంబంధించిన ఒక వీడియో...

రోడ్డుపై ఆహారం విక్రయిస్తున్న ఈ అందమైన అమ్మాయి ఎవరంటే...

అమన్ హుండల్ అనే అందమైన యువతి రోడ్డు పక్కన ఆహారం విక్రయిస్తోంది. ఈమెకు సంబంధించిన ఒక వీడియో ‘అఫీషియల్ సహీ హై’ అనే యూట్యూబ్ చానల్‌లో చేరి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమన్ హుండల్ సింగపూర్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుకుంది. ఆమె ఏదో ఒక పెద్ద హోటల్‌లో పనిచేసే బదులు తనదైన మార్గాన్ని ఎన్నుకుంది. ఇతరుల దగ్గర పనిచేసే బదులు రోడ్డు పక్కన తన ధాబాను ప్రారంభించి, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

అమన్ ఎంతో పరిశుభ్రత పాటిస్తూ వంటలు చేస్తుంది. తాను వంట చేసే సమయంలో పూర్తి హైజీన్‌కు ప్రాధాన్యతనిస్తానని తెలిపింది. తాను ఆహారం వడ్డించేందుకు వినియోగించే ప్లేట్లు పర్యావరణానికి ఏమాత్రం హానిచేయవని తెలిపింది. ఉదయం ఆరుగంటకు వంట చేయడం ప్రారంభించి 11 గంటలకల్లా ఆహారం సిద్ధం చేస్తానని పేర్కొంది. అమన్ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు పక్కగా ఉన్న తన ధాబాను తెరుస్తుంది. ఈ సందర్భంగా అమన్ మాట్లాడుతూ మహిళలు ఇటువంటి పని చేసేందుకు సంకోచిస్తారని, ఎవరైనా సరే తమకు ఇష్టమైన పనిని చేయడానికి వెనుకాడకూడదని అన్నారు.

Updated Date - 2022-10-31T07:41:59+05:30 IST