పుట్టింటికి వెళ్లి 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన తల్లి.. 11 ఏళ్ల కూతురు ఏడుస్తూ కనిపించడంతో ఏమైందని ఆమె ఆరాతీస్తే..

ABN , First Publish Date - 2022-08-18T17:50:59+05:30 IST

ఆ మహిళకు ఐదుగురు పిల్లలు. రాఖీ పండుగ సందర్భంగా వారందర్నీ ఇంట్లోనే వదిలి.. ఆమె మాత్రం పుట్టింటికి వెళ్లింది. అక్కడ సోదరుడికి రాఖీ కట్టి.. మూడు రోజులపాటు పుట్టింట్లోనే ఉండిపోయింది. మూడు రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో

పుట్టింటికి వెళ్లి 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన తల్లి.. 11 ఏళ్ల కూతురు ఏడుస్తూ కనిపించడంతో ఏమైందని ఆమె ఆరాతీస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ మహిళకు ఐదుగురు పిల్లలు. రాఖీ పండుగ సందర్భంగా వారందర్నీ ఇంట్లోనే వదిలి.. ఆమె మాత్రం పుట్టింటికి వెళ్లింది. అక్కడ సోదరుడికి రాఖీ కట్టి.. మూడు రోజులపాటు పుట్టింట్లోనే ఉండిపోయింది. మూడు రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో 11ఏళ్ల పెద్ద కూతురు.. ఏడుస్తూ కనిపించడంతో ఆమె కంగారుపడింది. దగ్గరకు తీసుకుని ఏమైందంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కూతురు చెప్పిన విషయం విని.. ఆ తల్లి షాకైంది. ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌(Rajasthan) లోని దుంగార్పూర్‌కు చెందిన మహిళ(Woman)కు ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిులు, ఇద్దరు అబ్బాయిలను ఇంట్లోనే వదిలేసి ఆమె తాజాగా రాఖీ పండుగ సందర్భంగా తన పుట్టింటికి వెళ్లింది. అనంతరం మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చింది. ఈ క్రమంలో 11 ఏళ్ల కూతురు ఏడుస్తూ కనిపించడం చూసి కంగారుపడింది. వెంటనే ఆ అమ్మాయి వద్దకు వెళ్లి.. విషయం ఆరా తీసింది. తాను పుట్టింటికి వెళ్లిన రోజు రాత్రి.. కూతురిపై తన భర్త అత్యాచారం చేశాడని తెలుసుకుని షాకైంది. విషయాన్ని పుట్టింటి వాళ్లకు చెప్పి బాధపడింది. అయితే తన సోదరుడు చెప్పిన మాటలతో ఆమె ధైర్యం తెచ్చుకుంది. సుమారు ఐదు రోజుల తర్వాత కూతురుతో సహా స్థానిక పోలీస్ స్టేషన్‌(Police Station)కు వెళ్లింది. అనంతరం తన భర్త(Husband) చేసిన నీచమైన పని గురించి చెప్పి, ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు(Police Case) చేసిన అధికారులు.. ఆ కామాందుడిని అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2022-08-18T17:50:59+05:30 IST