ఈ వధువుకు మోయలేనంత గిఫ్ట్ వచ్చింది.. సోదరులు ఇచ్చిన బహుమతి చూసి బంధువులంతా ఖంగుతిన్నారు..

ABN , First Publish Date - 2022-01-30T02:57:06+05:30 IST

మలేషియాలోని ఓ కల్యాణ మండపంలో వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తాళి కట్టే కార్యక్రమం ముగిసిన తర్వాత వధూవరులు ఇద్దరూ వేదికపై ఉన్నారు. ఇంతలో బంధువులు, స్నేహితులంతా ఎవరికి..

ఈ వధువుకు మోయలేనంత గిఫ్ట్ వచ్చింది.. సోదరులు ఇచ్చిన బహుమతి చూసి బంధువులంతా ఖంగుతిన్నారు..

వివాహ సమయంలో వధూవరులకు గిఫ్ట్‌లు రావడమనేది సహజమే. బంధువులు, స్నేహితులంతా వారి వారి స్థాయికి తగ్గట్టు బహుమతులు తీసుకొస్తుంటారు. బాగా కావాల్సిన వారైతే ఖరీదైన బహుమతులు ఇవ్వడం చూస్తూనే ఉంటాం. కొందరు నగలు, మరికొందరు నగదు రూపంలో కూడా ఇస్తుంటారు. ఇంకొందరైతే, వధూవరులు జీవితాంతం గుర్తుంచుకునే బహుమతులు ఇచ్చి.. పెళ్లిలో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. స్నేహితులైతే మండపంలో వింత వింత బహుమతులు ఇచ్చి ఆట పట్టిస్తుంటారు. మలేషియాలో జరిగిన ఓ పెళ్లిలో వధువుకు తన సోదరులు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఆ బహుమతి చూసిన బంధువులంతా ముక్కున వేలేసుకున్నారు.


మలేషియాలోని ఓ కల్యాణ మండపంలో వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లి ముహూర్తం ముగిసిన తర్వాత వధూవరులు ఇద్దరూ వేదికపై ఉన్నారు. ఇంతలో బంధువులు, స్నేహితులంతా ఎవరికి తోచిన బహుమతులు వారు ఇస్తూ.. నూతన దంపతులతో ఫొటోలు దిగుతున్నారు. ఈలోగా వధువు కజిన్ బ్రదర్స్.. తెల్లటి కవర్‌తో ప్యాక్ చేయబడిన పెద్ద గిఫ్ట్‌ను మోసుకుంటూ లోపలికి తెచ్చారు. అది చూసిన వారంతా.. చెల్లెలికి ఈ అన్నగారు మంచి ఖరీదైన గిఫ్టు తెస్తున్నారే.. అని గుసగుసలాడుకున్నారు.

పూల దండ విషయంలో గొడవ.. చివరకు ఈ పెళ్లికూతురు చేసిన పని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు..


వేదిక పైకి తీసుకెళ్లి వధూవరులతో గిఫ్ట్‌ను తెరిపించారు. తీరా కవర్ తీశాక గిఫ్ట్‌ను చూసి అంతా అవాక్కయ్యారు. అందులో గ్యాస్ సిలిండర్ ఉండడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పక్కున నవ్వడం మొదలెట్టారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. గ్యాస్ ధరలు చాలా పెరిగాయి.. ఈ సిలిండర్ వధూవరులకు ఎంతో ఉపయోగపడుతుందని.. కొంతమంది చమత్కరిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

తీరా మూడు ముళ్లు వేశాక వధువు రివర్స్.. ఆ ఒక్క కారణం చూపి వద్దంటే వద్దంది.. చివరకు ఏమైందంటే..

Read more