Ali: పవన్‌ తప్పకుండా వస్తారు!

ABN , First Publish Date - 2022-10-31T16:26:08+05:30 IST

పవన్‌కల్యాణ్‌, హాస్యనటుడు అలీ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ మంచి స్నేహితులు. రాజకీయ పార్టీల పరంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినా స్నేహం మాత్రం అలాగే ఉంటుందని

Ali:  పవన్‌ తప్పకుండా వస్తారు!


పవన్‌కల్యాణ్‌(Pawan kalyan), హాస్యనటుడు అలీ (Ali )మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ మంచి స్నేహితులు (Friend ship). రాజకీయ పార్టీల పరంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినా స్నేహం మాత్రం అలాగే ఉంటుందని ఇద్దరూ పలు సందర్భాల్లో చెప్పారు. పవన్‌ నటించిన ప్రతి సినిమాలోనూ అలీకి తప్పనిసరిగా పాత్ర ఉంటుంది. ఈ మధ్యన పవన్‌ నటించిన ‘వకీల్‌ సాబ్‌’, ‘భీమ్లానాయక్‌’ చిత్రాల్లో అలీ కనిపించలేదు. తాజాగా ఇదే విషయాన్ని అలీ ముందు ఉంచగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ షోకు పవన్‌ కల్యాణ్‌ కూడా వస్తారు. ఆయనే ఆ మాట చెప్పారు. ప్రస్తుతం ఆయన బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. కానీ త్వరలో తప్పకుండా వస్తారు. భీమ్లా నాయక్‌, వకీల్‌సాబ్‌ చిత్రాల్లో ఎందుకు నటించలేదు అన్న ప్రశ్నకు ‘‘ఆ రెండు సీరియస్‌ సినిమాలు. అందులో కామెడీకి స్కోపు లేదు. నేనే కాదు.. వేరే కమెడియన్‌ కూడా ఈ చిత్రంలో లేరు. పవన్‌ కల్యాణ్‌ తదుపరి సినిమాల్లో కామెడీ ఉంటే.. నా పాత్ర కచ్చితంగా ఉంటుంది’’ అని అన్నారు. 


Updated Date - 2022-10-31T16:28:23+05:30 IST