ఎయిర్‌పోర్టులో IPS ఆఫీసర్ అధికారి లగేజీ తనిఖీ.. కేజీల కొద్ది పచ్చి బఠాణీ లభ్యం.. విషయం తెలిసి నెటిజన్లు షాక్..

ABN , First Publish Date - 2022-03-18T03:19:21+05:30 IST

ఆయన ఒక ఐపీఎస్ అధికారి. ఒడిశాలో ఉన్నత పదవిలో పని చేస్తున్నారు. తాజాగా ఓ పని మీద జైపూర్ వెళ్లారు. పని పూర్తైన అనంతరం తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే

ఎయిర్‌పోర్టులో IPS ఆఫీసర్ అధికారి లగేజీ తనిఖీ.. కేజీల కొద్ది పచ్చి బఠాణీ లభ్యం.. విషయం తెలిసి నెటిజన్లు షాక్..

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ఒక ఐపీఎస్ అధికారి. ఒడిశాలో ఉన్నత పదవిలో పని చేస్తున్నారు. తాజాగా ఓ పని మీద జైపూర్ వెళ్లారు. పని పూర్తైన అనంతరం తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే ఆ ఐపీఎస్ ఆఫీసర్ బ్యాగు చూసి.. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. బ్యాగును ఓపెన్ చేయాల్సిందిగా ఆయనను కోరారు. అనంతరం అందులో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో బ్యాగులో తాను ఏం పట్టుకెళ్తున్ననే విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేశారు. ప్రస్తుతం ఈ అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 



ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఒడిశా ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఓ పని మీద జైపూర్ వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరుగు పయనమయ్యారు. లగేజీతో సహా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనను.. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. బ్యాగులో ఏముందో చూపించాల్సిందిగా కోరారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆయన తన బ్యాగును ఓపెన్ చేశారు. అంతే.. అందులో కనిపించిన వాటిని చూసి సెక్యూరిటీ సిబ్బంది షాకయ్యారు. బ్యాగులో కేజీల కొద్ది పచ్చి బఠాణీని చూసి సెక్యూరిటీ అధికారులు షాకయ్యారు. ఈ క్రమంలోనే అరుణ్ బోత్రా కూడా తన బ్యాగులో ఏముంది అనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రపంచానికి చూపించారు. జైపూర్‌లో కేజీ పచ్చి బఠాణీ రూ.40కే దొరికిందని.. అందువల్ల కొనుగోలు చేసి పట్టుకెళ్తున్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. దీంతో ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వాటిని చూసి నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 




Updated Date - 2022-03-18T03:19:21+05:30 IST