తనతో రావడానికి నిరాకరించిన భార్యకు భర్త షాకింగ్ ట్విస్ట్.. మరదలితో కలిసి..

ABN , First Publish Date - 2022-04-29T20:37:20+05:30 IST

ఆ వ్యక్తికి 12 సంవత్సరాల కిత్రం వివాహం జరిగింది.. నలుగురు పిల్లలు ఉన్నారు.

తనతో రావడానికి నిరాకరించిన భార్యకు భర్త షాకింగ్ ట్విస్ట్.. మరదలితో కలిసి..

ఆ వ్యక్తికి 12 సంవత్సరాల కిత్రం వివాహం జరిగింది.. నలుగురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు సవ్యంగా సాగిన అతని కాపురంలో తరువాత గొడవలు మొదలయ్యాయి.. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే నివసిస్తోంది.. భార్యను పుట్టింటి నుంచి తీసుకొచ్చేందుకు అతను చాలా ప్రయత్నించాడు.. తనతో పాటు రావడానికి ఆమె నిరాకరిస్తుండడంతో అతను అందరికీ షాకిచ్చాడు.. మైనర్‌ అయిన తన భార్య సోదరికి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకొని పారిపోయాడు. 


బిహార్‌ రాష్ట్రంలో ఛప్రా జిల్లాకు చెందిన కృష్ణ రామ్ అనే వ్యక్తికి 12 సంవత్సరాల కిత్రం సంకటి దేవితో వివాహం జరిగింది. ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు సవ్యంగా సాగిన వీరి కాపురంలో తరువాత కలతలు మొదలయ్యాయి. దీంతో సకంటి దేవి భర్తను వదిలి తన పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే నివసిస్తోంది. భర్త ఎంత అడిగినా పుట్టింటికి వెళ్లేందుకు అంగీకరించడం లేదు. దీంతో రామ్ తన భార్య సోదరికి మాయ మాటలు చెప్పి ఆమెను తీసుకుని పారిపోయాడు. 


అప్పటికే ఆ మైనర్ బాలికకు ఇంట్లో వాళ్లు పెళ్లి సెట్ చేశారు. ఆ పెళ్లి ఇష్టం లేక బావతో ఆ బాలిక పారిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు అల్లుడిపై కిడ్నాప్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరినీ వెతికి పట్టుకున్నారు. మైనర్ బాలికను తీసుకెళ్లినందుకు కృష్ణ రామ్‌ను అరెస్ట్ చేశారు. బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్న తల్లిదండ్రుల నుంచి తప్పించుకునేందుకే రామ్‌తో కలిసి పారిపోతున్నట్లు మైనర్ బాలిక పోలీసులకు చెప్పింది.


Updated Date - 2022-04-29T20:37:20+05:30 IST