Sniffer Dog Delivers 3 Pups: మూడు పిల్లలకు జన్మనిచ్చిన స్నిఫర్ డాగ్.. ఎలా జరిగిందో చెప్పాలంటూ విచారణకు ఆదేశించిన బీఎస్ఎఫ్!

ABN , First Publish Date - 2022-12-31T21:48:03+05:30 IST

మేఘాలయలోని భారత సరిహద్దు దళానికి (BSF) చెందిన స్నిఫర్ డాగ్స్‌లో ఒకటి గర్భం దాల్చి మూడు పిల్లలకు

Sniffer Dog Delivers 3 Pups: మూడు పిల్లలకు జన్మనిచ్చిన స్నిఫర్ డాగ్.. ఎలా జరిగిందో చెప్పాలంటూ విచారణకు ఆదేశించిన బీఎస్ఎఫ్!
Dog

న్యూఢిల్లీ: మేఘాలయలోని భారత సరిహద్దు దళానికి (BSF) చెందిన స్నిఫర్ డాగ్స్‌లో ఒకటి గర్భం దాల్చి మూడు పిల్లలకు జన్మనివ్వడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇదెలా జరిగిందో చెప్పాలంటూ ‘కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ’(Court Inquiry)కి ఆదేశించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలంటూ డిప్యూటీ కమాండెంట్ స్థాయి అధికారిని బీఎఎస్ఎఫ్ ఆదేశించింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న స్నిఫర్ డాగ్ లాల్సీ డిసెంబరు 5న ఉదయం దాదాపు10 గంటల సమయంలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది.

డిసెంబరు 19 నాటి షిల్లాంగ్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ బీఎస్ఎఫ్ ఆదేశాలకు అనుగుణంగా యూనిట్‌లోని డిప్యూటీ కమాండెంట్ ఒక సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (SCOI) నిర్వహించి లాల్సీ(Lalcy).. మూడు పిల్లలకు జన్మనివ్వడానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుపుతారు. దర్యాప్తు అనంతరం డిసెంబరు 30లోపు నివేదికను అందజేయాలని ఆదేశాల్లో బీఎస్ఎఫ్ పేర్కొంది.

కాగా అత్యుత్తమ శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్‌ వాటి హ్యాండ్లర్ల పర్యవేక్షణలో ఉంటాయి. వీటికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేస్తుంటారు. వీటిని ఇతర శునకాలతో కలవనివ్వరు. పశువైద్యుల పర్యవేక్షణలోనే వీటి బ్రీడింగ్ జరుగుతుందని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2022-12-31T21:49:36+05:30 IST