HIT 2 Teaser: మరింత క్రూరంగా సెకండ్ కేస్.. ఈ సారి నోటి దురుసుతో..

ABN , First Publish Date - 2022-11-03T13:55:07+05:30 IST

ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకుండా హీరోగా అవకాశాలు దక్కించుకుని తనకంటూ గుర్తింపు పొందిన నటుడు అడివి శేష్ (Adivi Sesh).

HIT 2 Teaser: మరింత క్రూరంగా సెకండ్ కేస్.. ఈ సారి నోటి దురుసుతో..

ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకుండా హీరోగా అవకాశాలు దక్కించుకుని తనకంటూ గుర్తింపు పొందిన నటుడు అడివి శేష్ (Adivi Sesh). వరుసగా థ్రిల్లర్ సినిమాలతో ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో తాజాగా నటించిన ఇన్వెస్ట్‌గెటివ్ మూవీ ‘హిట్ 2’ (HIT 2). ‘ది సెకండ్ కేస్’ అనేది ట్యాగ్‌లైన్. ‘హిట్ ది ఫస్ట్ కేసు’ డైరెక్టర్ అయిన యువ దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించాడు. హిట్ యూనివర్స్‌లో భాగంగా మొదటి చిత్రంలో విశ్వక్ సేన్‌ని పరిచయం చేసిన ఈ దర్శకుడు.. సీక్వెల్‌తో శేష్‌ని తన ప్రపంచంలోకి తీసుకొస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ని చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

దీనికి సంబంధించి హీరో శేష్ ఓ ట్వీట్ చేశాడు. అందులో.. ‘భయం గురించి మీకేం తెలుసు?. మీకు త్వరలోనే తెలుస్తుంది. హిట్ 2 టీజర్‌ని యూట్యూబ్‌లో చూడండి. హెచ్చరిక: పిల్లల కోసం కాదు’ అని శేష్ రాసుకొచ్చాడు. ఈ పోస్టులో ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో నాని(Nani)ని, దర్శకుడు శైలేష్‌ని కూడా ట్యాగ్ చేశాడు. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

‘హిట్ 1’లో విశ్వక్ సేన్‌కి పొగరు ఉన్నట్లుగానే.. హిట్ 2లో శేష్‌కి నోటి దురసుతనం ఉంటుంది. ఎవరనేది చూడకుండా కుండ బద్దలు కొట్టేసినట్లు మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా.. మొదటి భాగం కంటే ఇంకొంచెం క్రూయల్‌గా ఈ సినిమా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. గతంలో విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్, పోస్టర్లు క్రియేట్ చేసిన హైప్‌ని ఈ టీజర్ భారీగా పెంచేసింది. మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ డిసెంబర్ 2న విడుదల కానుంది.

Updated Date - 2022-11-03T13:59:37+05:30 IST