పొరపాటున చూయింగ్ గమ్ మింగేస్తే ఏమవుతుంది? శరీరంలో అది ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-10-15T15:54:47+05:30 IST

చూయింగ్ గమ్ అంటే చాలామందికి విపరీతమైన క్రేజ్.

పొరపాటున చూయింగ్ గమ్ మింగేస్తే ఏమవుతుంది? శరీరంలో అది ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిస్తే...

చూయింగ్ గమ్ అంటే చాలామందికి విపరీతమైన క్రేజ్. ఇది ముఖంపై ఉన్న కొవ్వును తొలగిస్తుందని కొందరు చెబుతుండగా, దీనిని నమలడం వల్ల కూల్‌గా ఉంటామని మరికొందరు చెబుతారు. ఇతరులను ఇంప్రెస్ చేయడానికే దీనిని నములుతామని కొందరు అంటారు. మరికొందరైతే చూయింగ్ గమ్ నమిలి బెలూన్‌ ఊది సంతోషిస్తుంటారు. అయితే ఒక్కోసారి చూయింగ్ గమ్ మింగేస్తుంటారు. అటువంటప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడుతుంటారు. ఈ విషయంలో అనేక అపోహలున్నాయి. ఊపిరి ఆడక ఇబ్బంది పడతారని కొందరు అంటుంటే, మరికొందరు పేగులకు అది అంటుకుపోతుందని చెబుతారు. నిజానికి చూయింగ్ గమ్ మింగినప్పుడు మలద్వారం ద్వారా ఇతర జీర్ణ పదార్థాల మాదిరిగాను బయటకు వస్తుంది. అయితే పెద్దల కంటే పిల్లకు చూయింగ్ గమ్ వల్ల అధిక హాని కలుగుతుంది. 



చూయింగ్ గమ్ సాధారణ స్థితిలో శరీరం నుండి బయటకు రావడానికి ఒకటి నుండి రెండు రోజులు పడుతుంది. రబ్బర్ మాదిరిగా ఉండటం వల్ల శరీరం నుంచి బయటకు వెళ్లడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. శరీరం నుంచి ఒక రోజులో చూయింగ్ గమ్‌ను బయటకు వెళ్లకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సివుంటుంది. చూయింగ్ గమ్ శరీరం నుండి బయటకు రాకపోతే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బీపీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వికారం, నెర్వస్‌నెస్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలా మందిలో అలెర్జీలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా పిల్లల విసర్జన అవయవాలు పెద్దలతో పోలిస్తే అంతగా అభివృద్ధి చెందవు. అందుకే చూయింగ్ గమ్ వారికి మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. చూయింగ్ గమ్ నమిలేటప్పుడు పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాలి.



Updated Date - 2022-10-15T15:54:47+05:30 IST