-
-
Home » Prathyekam » A youth from Bihar lost One lakh thirty thousand rupees by playing a game on his phone and ended up playing a robbery drama kjr spl-MRGS-Prathyekam
-
బెదిరించి రూ.1.30 లక్షల్ని కొట్టేశారంటూ ఓ కుర్రాడి కేసు.. అతడి ఫోస్ స్విచాఫ్‌లోనే ఉండటంతో పోలీసులకు కొత్త డౌట్.. చివరకు..
ABN , First Publish Date - 2022-09-14T00:30:14+05:30 IST
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు వివిధ నేరాలకు పాల్పడుతుంటారు. అలాగే ఇంకొందరు వివిధ ఆటలు ఆడుతుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు వివిధ నేరాలకు పాల్పడుతుంటారు. అలాగే ఇంకొందరు వివిధ ఆటలు ఆడుతుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. కొందరు తమ తెలివితేటలతో డబ్బు సంపాదిస్తున్నారు. మరికొందరు ఆన్‌లైన్ గేమ్స్ (Online games) ఆడటం ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల మన చుట్టూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బీహార్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. తనను బెదిరించి రూ.1.30 లక్షల్ని కొట్టేశారని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతడి ఫోన్ స్విచాఫ్‌లో ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. విచారించగా చివరకు అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
బీహార్ (Bihar) భాగల్‌పూర్ లక్ష్మీపూర్ గోపాల్‌పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిశాంత్‌కుమార్ రాజ్ అనే యువకుడు సోమవారం పోలీసులను ఆశ్రయించి.. ఆగస్టు 9న తనను బెదిరించి రూ.1.30లక్షలను కొట్టేశారంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు (Police investigation) ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటూ యువకుడి బ్యాంకు ఖతా వివరాలను పరిశీలించారు. దీంతో చివరకు దోపిడీ ఘటన డ్రామా అని తేలింది. యువకుడిని గట్టిగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
8 నెలల పాపకు ఎందుకిలా అయిందో తెలిస్తే.. ఫోన్‌ను పిల్లల దరిదాపులకు కూడా రానివ్వరు.. తల్లి బాత్రూంకు వెళ్లిన టైమ్‌లో..
నిశాంత్‌కుమార్ సుమారు 8 నెలలుగా మొబైల్‌లో తీన్ పట్టీ ఆట ఆడుతున్నాడు. మొదట్లో డబ్బు బాగానే గెలుచుకునేవాడు. దీంతో పూర్తిగా ఆటలో మునిగిపోయాడు. అయితే తర్వాత రాను రాను డబ్బులు పోవడం మొదలైంది. చివరికి తన డబ్బులు మొత్తం ఖాళీ అయ్యాయి. ఎలాగైనా పోయిన డబ్బు రాబట్టుకోవాలనే తాపత్రయంలో తన అకౌంట్‌లో ఉన్న తండ్రి, మామకు సంబంధించిన డబ్బులను కూడా వాడాడు. చివరకు మొత్తం రూ.1.30లక్షలను పోగొట్టుకున్నాడు. ఇంట్లో తెలిస్తే కొడతారనే భయంతో ఫోన్‌ను నీళ్లలో పడేశాడు. తర్వాత దోపిడీ డ్రామా ఆడాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.