బ్రేకప్ చెప్పిందని మరీ ఇంత దారుణమా..? 22 ఏళ్ల యువతి అద్దెకు ఉంటున్న గదికి అతడు వెళ్లి మరీ..

ABN , First Publish Date - 2022-09-11T02:17:21+05:30 IST

ఆమె అద్దె ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. కళాశాలకు వస్తూ, పోయే క్రమంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కానీ తన జీవితంలో అనుకోని సమస్యలన్నీ అతడి కారణంగా వస్తాయని...

బ్రేకప్ చెప్పిందని మరీ ఇంత దారుణమా..? 22 ఏళ్ల యువతి అద్దెకు ఉంటున్న గదికి అతడు వెళ్లి మరీ..

ఆమె అద్దె ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. కళాశాలకు వస్తూ, పోయే క్రమంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కానీ తన జీవితంలో అనుకోని సమస్యలన్నీ అతడి కారణంగా వస్తాయని ఊహించలేకపోయింది. సాధరణంగా కొందరు ప్రేమికులు బ్రేకప్ చెప్పుకొనే సమయంలో ఒకరినొకరు ఇబ్బంది పెట్టకుండా.. ఎవరి జీవితాన్ని వారు ప్రశాంతంగా గడుపుతుంటారు. కానీ కొందరు యువకులు మాత్రం బ్రేకప్ చెప్పిన ప్రియురాలి పట్ల పగ పెంచుకుంటుంటారు. చివరకు వారిని చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌‌లోని ఓ యువతికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. బ్రేకప్ చెప్పిందనే కారణంతో ఓ యువకుడు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) జంజ్‌గిర్-చంపాకు చెందిన 22 ఏళ్ల యువతి.. సివిల్ లైన్స్ ప్రాంతంలోని ఓ గదిలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ బిలాస్‌పూర్‌లో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు జంజ్‌గిర్-చంపా జిల్లాలోని బరద్వార్‌లోని డేరాగఢ్‌కు చెందిన మనీష్ సాహుతో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ ఎంతో చనువుగా ఉండేవారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ ఇటీవల సాహును ఆహె దూరం పెడుతూ వచ్చింది. కొన్నాళ్లకు అతడికి బ్రేకప్ (Love breakup) చెప్పేసింది. ఈ క్రమంలో బుధవారం మనీష్ సాహు తన ప్రియురాలి గదికి వెళ్లాడు.

వాట్సప్‌లో ఓ యువతి నుంచి వాయిస్ మెసేజ్.. అంతా విని అవాక్కైన పోలీసులు.. హోటల్‌కు వెళ్లి తనిఖీ చేస్తే..


ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటూ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో దాడి చేశాడు. దీంతో యువతి శరీరంలో పలు చోట్ల గాయాలయ్యాయి. చివరకు అతడి నుంచి ఎలాగోలా బయటపడి ఇంటికి చేరుకుంది. రెండు రోజులుగా ఎవరికీ చెప్పకుండా అలాగే ఉండిపోయింది. శుక్రవారం తన సోదరుడు చూసి ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని తెలియజేసింది. దీంతో ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

కడుపునొప్పి భరించలేక ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన 33 ఏళ్ల మహిళ.. టెస్టులు చేసి డాక్టర్లు చెప్పిన షాకింగ్ నిజం విని..Updated Date - 2022-09-11T02:17:21+05:30 IST