-
-
Home » Prathyekam » A young man who killed his neighbors woman was angry that his wife did not have children In Chhattisgarh kjr spl-MRGS-Prathyekam
-
భార్యకు పిల్లలు పుట్టలేదనే కారణంతో ఎదురింటి మహిళను చంపిన భర్త.. అందుకే ఇలా చేశానంటూ ఆ వ్యక్తి చెప్పింది విని..
ABN , First Publish Date - 2022-09-18T00:43:19+05:30 IST
ప్రస్తుత హైటెక్ యుగంలోనూ కొందరు మూఢనమ్మకాలను విశ్వసించి, చివరకు జీవితాలను సర్వ నాశనం చేసుకుంటున్నారు. చదువులేని వారు నమ్మారంటే మూర్ఖత్వం అనుకోవచ్చు.. కానీ..

ప్రస్తుత హైటెక్ యుగంలోనూ కొందరు మూఢనమ్మకాలను విశ్వసించి, చివరకు జీవితాలను సర్వ నాశనం చేసుకుంటున్నారు. చదువులేని వారు నమ్మారంటే మూర్ఖత్వం అనుకోవచ్చు.. కానీ కొందరు ఉన్నత చదువులు చదివిన వారు కూడా మూఢ నమ్మకాలను నమ్ముతుంటారు. కొందరైతే ఈ నమ్మకాలతో చివరకు హత్యలు, ఆత్మలకు పాల్పడడం కూడా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా ప్రాంతాల్లో జరిగిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్యకు పిల్లలు పుట్టలేదనే కారణంతో ఎదురింటి మహిళను హత్య చేశాడు. అందుకే ఇలా చేశానంటూ చివరకు ఆ భర్త చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్గఢ్ కొరియా జిల్లా పోధి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమేష్ కుమార్ కేవత్ అనే వ్యక్తి భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఇతడికి కొన్నేళ్ల కిందట వివాహమైంది. అయితే ఇంత వరకూ సంతానం కలగలేదని.. ఉమేష్ రోజూ బాధపడేవాడు. వీరి ఇంటికి సమీపంలో ప్రేమ్సయ్ పాండో, కలేసియా అలియాస్ కౌశిల్య (50) దంపతులు నివాసం ఉంటున్నారు. కౌశిల్య అప్పుడప్పుడూ పూజలు చేస్తూ ఉంటుంది. ఉమేష్ భార్య ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంది. తన భార్యకు ఇలా జరగడానికి కౌశిల్యనే కారణమని.. ఉమేష్ కోపం పెంచుకున్నాడు.
కుక్కను దూరంగా తీసుకెళ్లమన్న భార్య.. పట్టించుకోని భర్త, కుటుంబ సభ్యులు.. దీంతో చివరకు కూతురితో కలిసి..
ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం వేచి చూస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కౌశిల్య.. గ్రామానికి సమీపంలోని చెరువు వద్ద స్నానం చేసి వస్తుండగా ఉమేష్ దాడి చేశాడు. పదునైన ఆయుధంతో కౌశిల్యపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.