యువకులంతా కలిసి డ్యాన్స్ వేస్తున్నారులే అనుకుంటే.. చివరికి ఇలా జరిగిందేంటి.. ఎంత పని చేశావు తమ్ముడు..

ABN , First Publish Date - 2022-03-19T22:26:26+05:30 IST

మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఫుల్‌గా మందు కొట్టాడు. అంతా కలిసి సరదా సరదాగా డ్యాన్స్ చేశారు. వారిని చూసి..

యువకులంతా కలిసి డ్యాన్స్ వేస్తున్నారులే అనుకుంటే.. చివరికి ఇలా జరిగిందేంటి.. ఎంత పని చేశావు తమ్ముడు..

నేటి యువత మద్యం మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. కొందరు యువకులు బాలికలు, యువతులు, మహిళల పట్ల దారుణాలకు ఒడిగడుతుంటే.. మరికొందరు యువకులు కుటుంబ సభ్యులపైనే దాడులకు తెగబడుతున్నారు. చివరకు కటకటాలపాలై.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఫుల్‌గా మందు కొట్టాడు. అంతా కలిసి సరదా సరదాగా డ్యాన్స్ చేశారు. వారిని చూసి పక్కన ఉన్న వాళ్లు కూడా ఎంజాయ్ చేశారు. అయితే ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు మద్యం మత్తులో చేసిన పని.. చివరకు వేడుకలను విషాదాంతంగా మార్చింది. వివరాల్లోకి వెళితే..


హోలీ సందర్భంగా దేశమంతా శుక్రవారం వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్‍‌లో కూడా సంబరాలను ఘనంగా నిర్వహించారు. అయితే ఇండోర్‌లోని కుష్వాహానగర్‌లో జరిగిన హోలీ వేడుకలు చివరకు విషాదాంతమయ్యాయి. స్థానికంగా నివాసం ఉంటున్న గోపాల్ సోలంకి(38) అనే టైలర్.. హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి గురువారం రాత్రి మద్యం సేవించాడు. అంతా పీకలదాకా తాగి హిందీ పాటలకు డ్యాన్స్ చేయడం మొదలెట్టారు. ఆ డ్యాన్స్ చూసి పక్కన వాళ్లు కూడా ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఇంతలో గోపాల్ తన చేతిలోకి కత్తిని తీసుకున్నాడు. కత్తితో డ్యాన్స్ చేస్తూనే.. ఛాతిపై ఎడమ వైపు నాలుగు సార్లు పొడుచుకున్నాడు.

భార్యకు టిఫిన్ తినిపించి, లాడ్జికి తీసుకెళ్లిన భర్త.. కానీ మాట్లాడే క్రమంలో చివరకు ఇంత పని చేస్తాడనుకోలేదు..


దీంతో పక్కన ఉన్న ఓ స్నేహితులు షాక్ అయ్యారు. ఇంతలో అతడి భార్య అక్కడికి వచ్చి.. ‘అయ్యో! ఎంత ఘోరం జరిగింది’ అంటూ అందరినీ పిలిచింది. అప్పటికే గోపాల్ ఛాతి నుంచి రక్తం ధారలుగా కారుతూ ఉంటుంది. తర్వాత స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ గోపాల్ మృతి చెందాడు. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. మొదటి భార్యతో విడిపోయిన గోపాల్.. ప్రస్తుతం రెండో భార్య, పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు పోలీసు విచారణలో తెలిసింది. గోపాల్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన పేషంట్.. వీధి రౌడీలా మారిన వైద్యుడు.. కనీసం కనికరం కూడా లేకుండా..

Updated Date - 2022-03-19T22:26:26+05:30 IST

Read more