ఇలా Love ప్రపోజ్ చేస్తే.. ఏ అమ్మాయి కాదంటుంది చెప్పండి!

ABN , First Publish Date - 2022-05-24T01:33:24+05:30 IST

ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ప్రేమించిన అమ్మాయికి ఆ విషయం ఎలా చెప్పాలా అని చాలా మంది ప్రేమికులు ఆలోచిస్తుంటారు. దాన్ని ప్రేయసికి అర్థమయ్యేలా ఒక్కొక్కరు ఒక్కో దారి

ఇలా Love ప్రపోజ్ చేస్తే.. ఏ అమ్మాయి కాదంటుంది చెప్పండి!

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ప్రేమించిన అమ్మాయికి ఆ విషయం ఎలా చెప్పాలా అని చాలా మంది ప్రేమికులు ఆలోచిస్తుంటారు. దాన్ని ప్రేయసికి అర్థమయ్యేలా ఒక్కొక్కరు ఒక్కో దారి వెతుకుతారు. ఈ క్రమంలో స్టేడియంలో ప్రపోజ్‌ చేయడం.. సినిమాలో హాల్‌లో చెప్పడం.. పార్కులో ప్రపోజ్‌ చేయడం లాంటివి ఎన్నో చూశాం.. అయితే ఓ యువకుడు తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సౌరభ్ కస్బేకర్.. బుద్గావ్-సాంగ్లీలోని వసంత్‌వాడ పాటిల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ విభాగంలో చదువుతున్నాడు. అదే కాలేజ్‌లో ఉత్కర్ష కూడా చదువుతోంది. అయితే ఆమెను చూసిన మొదటిసారి మనోడికి ప్రేమ కలిగిందట. కానీ చెప్పడానికి భయపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఉత్కర్ష వాళ్ల ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఇక లేట్ చేయకూడదు అనుకున్నాడు. వెంటనే తను ప్రేమించిన అమ్మాయికి విషయం చెప్పాలని.. ఆమె కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లే మార్గంలో పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేసి.. మ్యారీ మీ ఉత్కర్ష అని దాని కింద సౌరభ అని రాశాడు. యువతి అక్కడికి రాగానే హోర్డింగ్ చూసింది. అప్పుడే సౌరభ్ అక్కడికి వెళ్లి నేలపై కూర్చోని ఉత్కర్షకు ప్రపోజ్‌ చేశాడు. తనను ఇంతలా ప్రేమించిన వాడు దొరికినందుకు యువతి సంతోషంగా ప్రేమను ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ వెరైటీ లవ్ ప్రపోజల్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Updated Date - 2022-05-24T01:33:24+05:30 IST