వివాహితతో ఓ యువకుడి ప్రేమాయణం.. భర్తకు తెలియడంతో కలిసి చనిపోదామంటూ ఉరేసుకున్నారు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-01-25T02:13:59+05:30 IST

ఆమెకు కొన్ని సంవత్సరాల కిందటే వివాహం జరిగింది. అయినా వేరే వ్యక్తిని చూసి మనసు పడింది. అయితే ఈ ప్రేమ ఆమె భర్తకు తెలిసింది. దీంతో ఆ ప్రేమ జంట సంచలన నిర్ణయం తీసుకుంది. కలిసి బ

వివాహితతో ఓ యువకుడి ప్రేమాయణం.. భర్తకు తెలియడంతో కలిసి చనిపోదామంటూ ఉరేసుకున్నారు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు కొన్ని సంవత్సరాల కిందటే వివాహం జరిగింది. అయినా వేరే వ్యక్తిని చూసి మనసు పడింది. అయితే ఈ ప్రేమ ఆమె భర్తకు తెలిసింది. దీంతో ఆ ప్రేమ జంట సంచలన నిర్ణయం తీసుకుంది. కలిసి బతికేందుకు సాహసం చేయలేక.. కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. చివరకు షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకోవడంతో.. ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రకు చెందిన వివాహితకు ఫేస్‌బుక్ ద్వారా బీడ్ జిల్లాలోని బధ్రుక్ ప్రాంతానికి చెందిన 27ఏళ్ల జైపాల్‌‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతోదీంతో ఇద్దరూ తరుచూ కలుసుకునేవారు. ఈ క్రమంలోనే వారి ప్రేమ విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. దీంతో తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. సమాజాన్ని ఎదురించి కలిసి బతకలేక.. ఆత్మహత్య చేసుకుని ఇద్దరూ ఒకే సమయానికి కన్నుమూయాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఉరితాళ్లు సిద్ధం చేసుకున్నారు. అయితే చివరకు షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉరేసుకుని జైపాల్ ప్రాణాలు వదలగా.. తాడు తెగిపోవడం వల్ల సదరు మహిళ మాత్రం ప్రాణాలతో బయటపడింది. దీంతో వెంటనే.. పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని వివరించింది. జైపాల్ గురించి చెప్పి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. జైపాల్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
Updated Date - 2022-01-25T02:13:59+05:30 IST