Shocking scene: కారులో వెళ్తున్న మహిళా కానిస్టేబుల్.. పొదల్లోంచి అలికిడి రావడంతో.. దగ్గరికి వెళ్లి చూడగా..

ABN , First Publish Date - 2022-08-22T00:13:17+05:30 IST

వివిధ కేసుల పేరుతో వేధించే పోలీసులు ఉన్న ఈ సమాజంలో బాధితులకు న్యాయం చేసే పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. కొందరు పోలీసులైతే తమ ప్రాణాలను కూడా..

Shocking scene: కారులో వెళ్తున్న మహిళా కానిస్టేబుల్.. పొదల్లోంచి అలికిడి రావడంతో.. దగ్గరికి వెళ్లి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

వివిధ కేసుల పేరుతో వేధించే పోలీసులు ఉన్న ఈ సమాజంలో బాధితులకు న్యాయం చేసే పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. కొందరు పోలీసులైతే తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా బాధితులను రక్షిస్తుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా గుజరాత్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ అందరి ప్రశంసలూ అందుకుంటోంది. కారులో విధులకు వెళ్తున్న ఆమె.. రోడ్డు పక్క పొదల్లో అలికిడి రావడాన్ని గమనించింది. దీంతో అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. సమయానికి స్పందించడంతో ఆమెను అంతా అభినందిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


గుజరాత్ (Gujarat) రాష్ట్రం వడోదర (Vadodara) గ్రామ సమీపంలోని పోలీసు పోస్ట్‌ (Police post) వద్ద  సుహాని వాసవ అనే మహిళా కానిస్టేబుల్ (woman constable) విధులు నిర్వర్తిస్తోంది. ఆగస్టు 18 సాయంత్రం కారులో విధులకు బయలుదేరింది. అయితే కొంత దూరం వెళ్లగానే రోడ్డు పక్కన పొదల్లో అలికిడి రావడం కనిపించింది. ఎవరో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్లు అనుమానం వచ్చింది. దీంతో కారు దిగి అక్కడికి వెళ్లి చూసింది. 45 ఏళ్ల వ్యక్తి.. ఓ బాలిక దుస్తులు తీసేసి, అసభ్యకరంగా ప్రవర్తించడం (Indecent behavior) చూసి షాక్ అయింది. బాలికపై అత్యాచారం చేయబోతుండగా, అప్రమత్తమైన కానిస్టేబుల్.. బాలికను రక్షించింది. తోటి సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు.

ఉమ్మి మీద పడితే మాత్రం.. మరీ ఇంత దారుణమా.. ఏకంగా ప్రైవేట్ భాగాన్ని..


నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విచారించగా అసలు విషయం తెలిసింది. పండేసర ప్రాంతానికి చెందిన ప్రమోద్ రాంబచన్ సింగ్ అనే వ్యక్తి.. బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసహజ శృంగారం చేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకు బాలిక నిరాకరించడంతో బెదిరించాడు. నేను ఇంటికి వెళ్లాలి.. అని వేడుకుంటున్నా వినకుండా ఆమెను బలవంతం చేశాడు. సమయానికి కానిస్టేబుల్ గమనించడంతో బాలిక క్షేమంగా బయటపడింది. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Wife's shocking plan: నా భర్తను చంపేశారా! అంటూ కిల్లర్లకు భార్య ఫోన్.. చంపేంత ధైర్యం లేక.. చివరకు భర్తతో కలిసి వారు ఆడిన డ్రామాతో..



Read more