గాజులు కొనుక్కుంటానంటే పెళ్లయిన ఏడో రోజే మార్కెట్‌కు తీసుకెళ్లిన భర్త.. నడిరోడ్డుపై ఊహించని షాకిచ్చిన భార్య..!

ABN , First Publish Date - 2022-06-23T23:40:32+05:30 IST

ఒక్కసారి మెడలో తాళి పడగానే భర్తే సర్వస్వంగా భావిస్తారు మహిళలు. కుటుంబ సంక్షేమం కోసం తమ జీవితాన్నే త్యాగం చేస్తారు. అలాంటి మహిళలు ఉన్న ఈ సమాజంలో భర్తలను మోసం చేసే...

గాజులు కొనుక్కుంటానంటే పెళ్లయిన ఏడో రోజే మార్కెట్‌కు తీసుకెళ్లిన భర్త.. నడిరోడ్డుపై ఊహించని షాకిచ్చిన భార్య..!

ఒక్కసారి మెడలో తాళి పడగానే భర్తే సర్వస్వంగా భావిస్తారు మహిళలు. కుటుంబ సంక్షేమం కోసం తమ జీవితాన్నే త్యాగం చేస్తారు. అలాంటి మహిళలు ఉన్న ఈ సమాజంలో భర్తలను మోసం చేసే ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందటే.. బీహార్‌లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పెళ్లయిన ఏడో రోజు భార్యకు గాజులు కొనిచ్చేందుకు మార్కెట్‌కు తీసుకెళ్లాడు. అయితే అక్కడ అంతా చూస్తుండగా భర్త ఎదుటే.. నడి రోడ్డుపై ఆమె ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. 


బీహార్ రాష్ట్రం ముంగేరు పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్వాలి పరిధి బీకాపూర్ సంతోషి మాత గాలి పొద్దర్ కాలనీలో నివాసం ఉంటున్న వివేక్ పొద్దార్‌ అనే యువకుడికి, నౌవాగర్‌లో నివాసముంటున్న రామ్‌విలాస్‌ కుమార్తె మోనితో జూన్‌ 14న వివాహమైంది. అనంతరం 16వ తేదీన రిసెప్షన్ నిర్వహించారు. 18న పుట్టింటికి వెళ్లిన మోని.. ఏడవ రోజు అత్తగారి ఇంటికి వచ్చింది. గాజులు కావాలని అడగడంతో అదే రోజు రాత్రి భార్యను మార్కెట్‌కు తీసుకెళ్లాడు. గాజులు కొనే సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అప్పటి దాకా భర్త చేయి పట్టుకుని ఉన్న ఆమె.. ఒక్కసారిగా దూరంగా వెళ్లింది. చూస్తుండగానే.. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ప్రియుడి వద్దకు వెళ్లి, అతడితో పాటూ వాహనంలో ఎక్కి వెళ్లిపోయింది.

ఉన్నట్టుండి చనిపోయిన మహిళ.. ఇంట్లో ఉన్న 20 పెంపుడు పిల్లులకు భోజనం పెట్టే వారే లేక ఆమె మృతదేహాన్నే..


ఊహించని ఈ ఘటనతో వివేక్.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తర్వాత తల్లి, సోదరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో తన భార్య నగలు కూడా ధరించి ఉందని వివేక్ తెలిపాడు. వివేక్ తల్లి మాట్లాడుతూ.. ‘‘నా భర్త చనిపోయాడు, మాకు ఒక్కడే కొడుకు. అందుకే ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేశాం.. కానీ కోడలు ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదు’’.. అంటూ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

9 నెలల గర్భవతి అయిన నా భార్యను కాపాడండి.. తాగడానికి నీళ్లు కూడా లేవంటూ ముఖ్యమంత్రికి మెయిల్ పంపిన భర్త.. చివరకు..

Updated Date - 2022-06-23T23:40:32+05:30 IST