-
-
Home » Prathyekam » A video of bulls attacking a woman walking on the road in Rajasthan is going viral kjr spl-MRGS-Prathyekam
-
రోడ్డుపై తనమానాన తాను నడుచుకుంటూ వెళ్తున్న మహిళ.. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండదు..!
ABN , First Publish Date - 2022-07-14T22:38:51+05:30 IST
మన మానాన మనం పోతున్నా... కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయాల్లోనే.. పొద్దున లేచి ఎవరి మొఖం చూశామో.. అని అనుకుంటూ ఉంటాం. ఊహించని..

మన మానాన మనం పోతున్నా... కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయాల్లోనే.. పొద్దున లేచి ఎవరి మొఖం చూశామో.. అని అనుకుంటూ ఉంటాం. ఊహించని ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. రాజస్థాన్‌లో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రోడ్డుపై తనమానాన తాను నడుచుకుంటూ వెళ్తోంది. అయితే ఉన్నట్టుండి జరిగిన ప్రమాదాన్ని ఆమె.. కలలో కూడా ఊహించి ఉండదు.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని తిన్వారీ పట్టణంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్న సీమా రాజ్‌పురోహిత్ అనే మహిళ.. పని ముగించుకుని ఇంటికి వస్తూ ఉంది. ఆ సమయంలో రోడ్డుపై కొన్ని ఎద్దులు పోట్లాడుకుంటున్నాయి. అదే సమయంలో ఆమె రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తోంది. అంతలో ఓ ఎద్దు ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చి మహిళను ఢీకొట్టింది. ఊహించని ఈ ప్రమాదానికి ఆమె ఎగిరి పక్కన పడింది. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న కొందరు గమనించి, ఆమెను కాపాడారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
కూతుర్ని డాక్టర్‌ను చెయ్.. ఆర్మీకి మాత్రం పంపకు.. అంటూ భార్యకు చివరి వీడియో.. ఓ సైనికుడి ఆత్మహత్య కేసులో..

స్థానికులు మాట్లాడుతూ ఎద్దుల దాడిలో గతంలో చాలా మంది గాయపడ్డారని తెలిపారు. ఎద్దులు ఎక్కడపడితే అక్కడ తిరగకుండా.. గోశాల నిర్మించి, అన్నింటినీ అక్కడకు తరలిస్తామని అధికారులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఇంతవరకూ దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. దీనిపై తహసీల్దార్ భన్వర్‌లాల్ మీనా మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న గోశాల నిర్వాహకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో మాట్లాడి.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.