Funny video: పెళ్లి పీటల మీదే ఇలా ఉంటే.. వివాహానంతరం వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో...
ABN , First Publish Date - 2022-08-10T03:12:05+05:30 IST
వివాహ సమయాల్లో చోటు చేసుకునే సరదా సరదా సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతుంటాయి. కొందరు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ప్రాంక్ వీడియోలు ..

వివాహ సమయాల్లో చోటు చేసుకునే సరదా సరదా సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతుంటాయి. కొందరు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ప్రాంక్ వీడియోలు (Prank videos) చేస్తుంటారు. వధూవరుల మధ్య చోటు చేసుకునే చిలిపి చిలిపి ఘటనలు కొన్నిసార్లు సీరియస్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెళ్లి పీటల మీద అందరి ముందే వధూవరుల మధ్య సరదా సంఘటన చోటు చేసుకుంది. తర్వాత అది కొంచెం సీరియస్ అయింది. చివరకు మండపంలో అంతా పగలబడి నవ్వుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఓ వివాహ వేడుకలో (wedding ceremony) వధూవరులు పీటలపై కూర్చుని ఉంటారు. ఆ సమయంలో వధువు చేతిలో ఉన్న ప్లేటును అందుకునేందుకు వరుడు ప్రయత్నిస్తాడు. దీంతో వధువు అతన్ని పక్కకు నెడుతుంది. తర్వాత వరుడు కూడా వధువు మొఖంపై చేయి వేసి పక్కకు నెట్టేస్తాడు. దీంతో వధువుకు ఒక్కసారిగా చిర్రెత్తుకొస్తుంది. పెళ్లి మంటపమని కూడా చూడకుండా వరుడి పైకి దూసుకెళ్తుంది. అతన్ని కింద పడేసి మరీ దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. వరుడు మాత్రం నవ్వుతూ ఉండగా, వధువు కాస్త సీరియస్గా కనిపించింది. పక్కనున్న వారు వీరిని చూసి పగలబడి నవ్వుకున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఈ దంపతులు ఇప్పుడే ఇలా ప్రవర్తిస్తుంటే.. ఇక వివాహానంతరం ఎలా సంసారం చేస్తారో.. ఏమో’’.. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.