Viral Video: బైక్‌పై స్టంట్ చేస్తుండగా అనూహ్య ఘటన.. యువకుడి టైం బాగుండి సరిపోయింది..

ABN , First Publish Date - 2022-07-31T02:54:52+05:30 IST

ప్రస్తుతం చాలా మంది యువకులు (young people) ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా (Social media) లో వైరల్ కావాలనే ఉద్దేశంతో ఇటీవల...

Viral Video: బైక్‌పై స్టంట్ చేస్తుండగా అనూహ్య ఘటన.. యువకుడి టైం బాగుండి సరిపోయింది..

ప్రస్తుతం చాలా మంది యువకులు (young people) ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా (Social media) లో వైరల్ కావాలనే ఉద్దేశంతో ఇటీవల కొందరు యువకులు చిత్రవిచిత్రమైన పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు విన్యాసాలు (Stunts) చేసే క్రమంలో ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఓ యువకుడు బైక్‌పై స్టంట్ చేస్తుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అయితే టైం బాగుండడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. 


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. కొందరు యువకులు రోడ్డుపై స్టంట్ చేస్తూ ఉంటారు. వారిలో ఓ వ్యక్తి ఒకడుగు ముందుకేసి బైకు ముందు చక్రాన్ని పైకి లేపి డ్రైవ్ చేస్తుంటాడు. సీటు వెనుక భాగంలో కాలు మోపి, నిలబడి వేగంగా అలాగే నడిపే క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పుతుంది. ఒకవైపు ఒరిగిపోయినా బైకును వదలకుండా అలాగే ముందుకు వెళ్తాడు. మధ్యలో ఆగి ఉన్న కారును ఢీకొని కింద పడిపోతాడు. అయితే ఈ ప్రమాదంలో అతడికి ఎలాంటి గాయాలూ కాకపోవడతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. చివరకు మళ్లీ పైకి లేచి బైకును తీసుకుని వెళ్లిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో 8మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇలాంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరం.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: మీకు రైలు ప్రయాణమంటే ఇష్టమా.. అయితే ఈ వీడియో చూస్తే.. వెంటనే అక్కడికి వెళ్లిపోతారు..





Updated Date - 2022-07-31T02:54:52+05:30 IST

Read more