-
-
Home » Prathyekam » A video of a young man playing with a king cobra is going viral on social media kjr spl-MRGS-Prathyekam
-
King Cobra video: అది కోబ్రా అనుకున్నావా.. లేక జీబ్రా అనుకున్నావా.. మరీ ఇలా ఆడుకుంటున్నావేంట్రా..
ABN , First Publish Date - 2022-09-27T03:07:18+05:30 IST
టెక్నాలజీ పెరిగిపోవడంతో ఏది నిజమైన వీడియోనో.. ఏది గ్రాఫిక్సో అర్థం కావడం లేదు. కొన్ని వీడియోలను చూస్తే.. అంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. మనుషులకు సాధ్యం కాని పనులను..

టెక్నాలజీ పెరిగిపోవడంతో ఏది నిజమైన వీడియోనో.. ఏది గ్రాఫిక్సో అర్థం కావడం లేదు. కొన్ని వీడియోలను చూస్తే.. అంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. మనుషులకు సాధ్యం కాని పనులను కొందరు అవలీలగా చేసేస్తుంటారు. అలాంటివి చూసినప్పుడు వీళ్లకేమైనా మానవాతీత శక్తులేమైనా ఉన్నాయా.. అని అనిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఓ వ్యక్తి కింగ్ కోబ్రాతో ఆడుకోవడం చూసి అంతా షాక్ అవుతున్నారు. అది కోబ్రా అనుకున్నావా.. లేక జీబ్రా అనుకున్నావా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. పాములను చూస్తూనే భయమేస్తుంది. అందులోనూ కింగ్ కోబ్రాలంటే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక్క సారి కాటేసిందంటే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అయితే ఓ యువకుడు మాత్రం కోబ్రాతో ఆట ఆడుకున్నాడు. ఓ పొడవాటి కింగ్ కోబ్రా ఇంటి ఆవరణలోకి వస్తుంది. దాన్ని చూడగానే పిల్లలంతా పరుగులు పెడతారు. అయితే యువకుడు మాత్రం పడుకుని డ్యాన్స్ వేసుకుంటూ.. పామును పట్టుకుని ఆడుకుంటాడు. కోబ్రాను తాకగానే పడగ విప్పి బుసలు కొడుతుంది. అయితే అతను మాత్రం ఏమాత్రం భయపడకుండా.. గట్టిగా పట్టుకుని ముఖానికి దగ్గరగా పెట్టుకుంటాడు. తల అటూ ఇటూ తిప్పుతూ పామును వెక్కిరిస్తాడు. అయితే కోబ్రా మాత్రం అతన్ని ఏమీ అనకపోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఇది గ్రాఫిక్స్ అని అంటుంటే.. కోబ్రాకు ఇతను క్లోజ్ ఫ్రెండ్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.