Viral Video: గుర్రంపై మనుషుల సవారీ మామూలే.. ఈ జింకపై కోతి సవారీ చూశారంటే అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2022-10-12T03:12:23+05:30 IST

మనుషులు చేసే కొన్ని విన్యాసాలు చూసినప్పుడు ఎలాంటి ఆశ్చర్యం కలుగుతుందో.. అప్పుడప్పుడూ కొన్ని జంతువులు చేసే విన్యాసాలు చూస్తే.. అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం...

Viral Video: గుర్రంపై మనుషుల సవారీ మామూలే.. ఈ జింకపై కోతి సవారీ చూశారంటే అవాక్కవుతారు..

మనుషులు చేసే కొన్ని విన్యాసాలు చూసినప్పుడు ఎలాంటి ఆశ్చర్యం కలుగుతుందో.. అప్పుడప్పుడూ కొన్ని జంతువులు చేసే విన్యాసాలు చూస్తే.. అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కలుగుతుంది. అరే! ఈ జంతువులకు ఎంత తెలివి.. అని అనిపిస్తుంటుంది. అలాగే బద్ధ శత్రువులాంటి జంతువులు కొన్నిసార్లు అందరినీ షాక్‌కు గురి చేస్తూ.. స్నేహితులుగా మారిపోతుంటాయి. అదేవిధంగా కోతులు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral videos) ఓ కోతి.. జింకపై చేసిన సవారీ (Monkey and deer videos) చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.


చెన్నైలో (Chennai) ఉన్న IIT మద్రాస్ క్యాంపస్ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. గడ్డి కోసం వెతుకుతున్న జింకను ఓ కోతి గమనిస్తుంది. చెట్టుపై నుంచి సరాసరి జింకపైకి దూకేస్తుంది. గుర్రంపై మనుషులు సవారీ చేసినట్లుగా జింకపై తాపీగా కూర్చుంటుంది. పద పదవే జింకా అన్నట్లుగా ఆదేశిస్తుంది. జింక కూడా ఏం బెదరకుండా.. దాని సవారీని ఆస్వాదిస్తుంది. ఎంతో ప్రేమతో కోతిని మోసుకుంటూ వెళ్తుంది. బిల్డింగ్ పక్క నుంచి గడ్డి కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ కోతి మాత్రం దాన్ని గట్టిగా పట్టుకుని సవారీని ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇవి ప్రకృతి కలిపిన స్నేహితులంటూ కొందరు.. కోతి, జింకను చూస్తుంటే ముచ్చటేస్తుందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

gym center: జిమ్‌ సెంటర్‌లో శిక్షణ పేరుతో నాలుగేళ్లుగా ట్రైనర్ నిర్వాకం.. ఇటీవల ఓ యువతికి శిక్షణ ఇచ్చే క్రమంలో అతడు చేసిన పనితో.. 





Updated Date - 2022-10-12T03:12:23+05:30 IST