-
-
Home » Prathyekam » A video of a monkey fighting a young woman for sunglasses is going viral kjr spl-MRGS-Prathyekam
-
Monkey video: నాకు నచ్చింది నాకే దక్కాలన్న కోతి.. నేనూ తగ్గనన్న యువతి.. చివరకు ఏమైందంటే..
ABN , First Publish Date - 2022-08-18T02:28:24+05:30 IST
చేతిలో తినుబండారాలు ఉన్న సమయంలో.. కోతుల (Monkeys) వద్దకు వెళ్లాలంటే భయపడతాం. కొన్నిసార్లు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో గానీ.. ఉన్నట్టుండి ఇలా వచ్చి, అలా..

చేతిలో తినుబండారాలు ఉన్న సమయంలో.. కోతుల (Monkeys) వద్దకు వెళ్లాలంటే భయపడతాం. కొన్నిసార్లు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో గానీ.. ఉన్నట్టుండి ఇలా వచ్చి, అలా లాక్కుని వెళ్లిపోతుంటాయి. ఇక పండ్ల దుకాణదారులైతే.. నిత్యం కోతులపై ఓ కన్నేసి ఉంచుతుంటారు. అయినా ఏదో ఒక సందర్భంలో తమకు కావాల్సిన ఆహారాన్ని ఎలాగోలా దక్కించుకుంటుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కోతి.. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ కోతికి తినుబండారాలకంటే గ్లామర్‌కు సంబంధించిన వస్తువులంటేనే ఇష్టమున్నట్టుంది. సన్ గ్లాసెస్ (Sunglasses) కోసం ఓ యువతితో దాదాపు యుద్ధమే చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రాంలో (Instagram) ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఆంజనేయుడి గుడికి (Anjaneya temple) వెళ్లిన ఓ యువతికి.. కోతి షాక్ ఇచ్చింది. ఆంజనేయుడి విగ్రహం వద్ద పూజలు చేసిన యువతి కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కోతి.. యువతి చేతిలో ఉన్న సన్ గ్లాసెస్‌పై కన్నేస్తుంది. ఎలాగైనా వాటిని దక్కించుకోవాలని ప్లాన్ వేస్తుంది. కొద్దిసేపు చూసి, తర్వాత నేరుగా యువతి వద్దకు వచ్చి, చేతిలోని గ్లాసెస్‌ని బలవంతంగా లాక్కుంటుంది. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్ అవుతుంది. తర్వాత ఆమె కూడా తగ్గకుండా.. ఎలాగైనా తన గ్లాసెస్‌ను తీసుకోవాలని ట్రై చేస్తుంది. దీంతో కోతి కోపంగా చూస్తూ భయపెడుతుంది. అయినా యువతి మాత్రం ఏమాత్రం భయపడకుండా.. కోతి చేతిలోని గ్లాసెస్‌ని కింద పడేస్తుంది. తర్వాత వాటిని చాకచక్యంగా తీసుకుని.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.