Viral Video: డ్యాన్స్ మాస్టర్ స్టెప్పులను మక్కీకి మక్కీ దింపేసిన చిన్నారి.. వావ్! అద్భుతం అంటున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-07-21T01:29:49+05:30 IST

చిన్న పిల్లలు పెద్దలను అనుకరించడం, వారు చేసే పనులను తామూ చేయడం సర్వసధారణంగా జరుగుతుంటుంది. అందుకే పిల్లలకు చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్పించాలని పెద్దలు..

Viral Video: డ్యాన్స్ మాస్టర్ స్టెప్పులను మక్కీకి మక్కీ దింపేసిన చిన్నారి.. వావ్! అద్భుతం అంటున్న నెటిజన్లు..

చిన్న పిల్లలు పెద్దలను అనుకరించడం, వారు చేసే పనులను తామూ చేయడం సర్వసధారణంగా జరుగుతుంటుంది. అందుకే పిల్లలకు చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్పించాలని పెద్దలు సూచిస్తుంటారు. కొందరు పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. ఒక్కసారి ఏదైనా చెబితే ఇట్టే చేసేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి వేసిన డ్యాన్స్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పెద్దలను చూసి అచ్చం అలాగే లైవ్‌గా స్టెప్పులు వేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. కొందరు యువతీయువకులు కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. వారికి ముందున్న యువతి డ్యాన్స్ వేస్తుండగా, మిగతా వారంతా అనుసరిస్తుంటారు. అయితే వీరి డ్యాన్స్‌ను అక్కడే ఉన్న ఓ బాలిక గమనిస్తూ ఉంటుంది. వెంటనే అక్కడికి వెళ్లి.. డ్యాన్స్ మాస్టర్ వేసిన స్టెప్పులను మక్కీకి మక్కీ దింపేస్తుంది. అచ్చం ఆమెలాగే డ్యాన్స్ చేస్తుంది. దీంతో అక్కడే ఉన్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఫోన్లలో వీడియోలు తీసుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ చిన్నారి పరిశీలన చాలా తీక్షణంగా ఉంది.. అంటూ ఒకరు, చిన్నారి చాలా అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తోంది.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మహిళపై అనుమానం రావడంతో తలుపులు బద్దలు కొట్టిన స్థానికులు.. బెడ్‌ రూమ్‌లో మంచం కింద తనిఖీ చేయగా.. షాకింగ్ సీన్..

Read more