చోరీ కేసులో అరెస్ట్ చేయబడిన మహిళకు.. రూ.2.50లక్షల పరిహారం ప్రకటించిన కోర్టు.. అసలు కథ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-26T23:24:22+05:30 IST

వివిధ కేసుల్లో అరెస్టయిన నిందితుల నుంచి నిజం రాబట్టే క్రమంలో కొందరు పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. నేరం చేశాడా లేదా అని కనీస విచారణ కూడా చేయకుండానే..

చోరీ కేసులో అరెస్ట్ చేయబడిన మహిళకు.. రూ.2.50లక్షల పరిహారం ప్రకటించిన కోర్టు.. అసలు కథ ఏంటంటే..

వివిధ కేసుల్లో అరెస్టయిన నిందితుల నుంచి నిజం రాబట్టే క్రమంలో కొందరు పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. నేరం చేశాడా లేదా అని కనీస విచారణ కూడా చేయకుండానే.. వివిధ రకాలుగా చిత్రహింసలు పెడుతుంటారు. తీరా అసలు నేరస్థుడు దొరికాక.. తప్పు చేశామని తెలుసుకుంటారు. కానీ తమ తప్పులు బయటికి రాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఇటీవల సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. త్రిపురలో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. చోరీ కేసులో అరెస్ట్ చేయబడిన మహిళకు.. కోర్టు తాజాగా రూ.2.50లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


త్రిపుర (Tripura) అగర్తల పరిధిలో 2021 అక్టోబర్‌లో జరిగిన చోరీ కేసులో పోలీసులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. తాను నేరం చేయలేదని వేడుకుంటున్నా పోలీసులు ఆమెపై దురుసుగా ప్రవర్తించారు. దుర్భాషలాడడమే కాకుండా నిజం ఒప్పుకోవాలంటూ చితకబాదారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. అయితే అనంతరం ఈ ఘటనపై బాధితురాలు కోర్టుకు వెళ్లింది. దీనిపై ఇప్పటి వరకూ విచారణ జరుగుతూనే ఉంది. బాధితురాలిని పోలీసులు హింసించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, చోరీ కేసులో విచారణ (Case investigation) కోసం మాత్రమే ఆమెను పిలిచారని.. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.

కాపురాలను కూల్చుతున్న కొత్త ట్రెండ్.. గిఫ్టుల పేరుతో ఏమార్చి రహస్యాలను భార్యాభర్తలు ఎలా బయటపెట్టుకుంటున్నారంటే..


వార్తాపత్రికల్లో (News papers) వచ్చిన వార్తలు నిజం కాదంటూ చెప్పుకొచ్చారు. అయితే బాధితురాలి తరపు న్యాయవాది వాదిస్తూ.. విచారణ పేరుతో బాధితురాలిని తీవ్రంగా హింసించారన్నారు. బాధితురాలు తీవ్రంగా గాయపడినట్లుగా అగర్తల ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన మెడికల్ రిపోర్టులను (Medical reports) కోర్టుకు సమర్పించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. చివరకు మహిళకు అన్యాయం జరిగినట్లు గుర్తించింది. విచారణ పేరుతో హింసించడం.. మానవ హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు నష్టపరిహారం కింద రూ.2.50లక్షలు అందజేయాలని ప్రకటిస్తూ తాజాగా తీర్పు (Court judgment) ఇచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Viral Video: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. నెట్టింట వైరల్‌గా మారిన 22 సెకన్ల వీడియో..!



Updated Date - 2022-09-26T23:24:22+05:30 IST