ఒకేఒక్కడు.. ఎవరి కంటా పడకుండా.. 25ఏళ్ల ఒంటరి జీవితం.. చివరకు అతడి మరణంతో..

ABN , First Publish Date - 2022-08-31T21:28:15+05:30 IST

మనుషులంటే కోపం.. తమ వారిని అక్రమంగా పొట్టనపెట్టుకున్నారన్న కసి.. కానీ అందుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోలేదు. స్వార్థపూరిత మనుషులకు దూరంగా ఉండడమే..

ఒకేఒక్కడు.. ఎవరి కంటా పడకుండా.. 25ఏళ్ల ఒంటరి జీవితం.. చివరకు అతడి మరణంతో..

మనుషులంటే కోపం.. తమ వారిని అక్రమంగా పొట్టనపెట్టుకున్నారన్న కసి.. కానీ అందుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోలేదు. స్వార్థపూరిత మనుషులకు దూరంగా ఉండడమే మేలనుకున్నాడు. ఏ ఒక్క మనిషినీ కనీసం కన్నెత్తి కూడా చూడకూడదనుకున్నాడు. అంతే! ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25ఏళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా అడవిలో ఏకాంత జీవితం గడిపాడు. చివరకు అదే అడవిలో తుది శ్వాస వదిలాడు. ఇంతకీ ఆ పేరు లేని వ్యక్తి ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు, వారికి జరిగిన అన్యాయం ఏంటి.. తదితర వివరాల్లోకి వెళితే..


అభివృద్ధి పేరుతో అడవులను అక్రమంగా నరికేస్తుండడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలోని జంతువులే కాకుండా, అడవులను నమ్ముకుని బతికే గిరిజనులకు కూడా అన్యాయం జరుగుతోంది. చివరికి వారి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. బ్రెజిల్‌లో (Brazil) ఓ ఆదివాసీ తెగకు (Adivasi tribe) కూడా ఇదే సమస్య ఎదురైంది. 1970 సంవత్సర కాలంలో బ్రెజిల్‌లోని తనారు ప్రాంత పరిధిలోని దట్టమైన అడవుల్లో.. జనజీవన స్రవంతికి దూరంగా ఓ తెగ నివసించేది. వీరిని ‘‘ది మ్యాన్ ఆఫ్ ది హోల్’’ (The Man of the Hole) అని పిలిచేవారు. జంతువులను వేటాడే క్రమంలో వీరు లోతైన గుంతలు తవ్వుతుంటారు. దీంతో ఈ తెగవారికి ఆ పేరు వచ్చింది. ఇదిలావుండగా, ఇక్కడి భూములను ఆక్రమించాలనే దురుద్దేశంతో కొందరు పశువుల కాపరులు.. ఈ తెగ వారిని అంతమొందించారు.

Transgenders agitation: బ్రాంచ్ మేనేజర్‌ను బయటికి లాగి.. రోడ్డుపై డ్యాన్స్ చేసిన హిజ్రాలు.. మద్దతుగా నిలిచిన స్థానికులు.. ఇంతకీ సమస్య ఏంటంటే..


ఆ సమయంలో కేవలం ఆరుగురు మాత్రంమే ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం 1995లో మైనింగ్ మాఫియా.. వీరిలో ఐదుగురిని చంపేసింది. చివరకు వారి బారి నుంచి ఒకే ఒక్క వ్యక్తి తప్పించుకని బయటపడ్డాడు. తమ తెగ వారందరినీ పొట్టన పెట్టుకున్న మనుషులపై అతడు ద్వేషం పెంచుకున్నాడు. కానీ ఎలాంటి ప్రతీకారం తీర్చుకోలేదు. మనుషులకు దూరంగా బతకాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి 25ఏళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా, ఒంటరి జీవితం గడిపాడు. 1996లో బ్రెజిల్‌ ఆదివాసీ వ్యవహారాల ఏజెన్సీ ఈ విషయం తెలసుకుని.. అప్పటి నుంచి అతడు సంచరించే ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోకి ఇతరులు వెళ్లడంపై బ్రెజిల్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో అతడు 2018లో ఏజెన్సీ సిబ్బంది కంటపడ్డాడు.

పర్సు కొట్టేస్తూ దొరికిపోయిన కుర్రాడు.. చితకబాదాక ఎందుకీ పని చేశావని నిలదీస్తే అతడు చెప్పింది విని నివ్వెరపోయిన జనం


చెట్టు నరుకుతూ కనిపించిన అతన్ని సిబ్బంది వీడియో తీశారు. దీన్ని గమనించిన ఆ వ్యక్తి.. తర్వాత అక్కడి నుంచి మకాం మార్చాడు. ఇలా పలు ప్రాంతాల్లో గుడిసెలు నిర్మించుకుంటూ ఉండేవాడని తెలిసింది. ఈ క్రమంలో రోన్డోనియాలోని తనారు ప్రాంత సమీపంలోని అడవిలో కర్రలు, ఆకులతో నిర్మించుకున్న గుడిసె వద్ద ఆగస్టు 23న అతడి మృతదేహాన్ని ఏజెన్సీ సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని బ్రెజిల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అతడికి పేరు కూడా లేదని, అలాగే అతడు ఏ బాష మాట్లాడతాడో కూడా తెలీదని చెప్పారు. మరణించేనాటికి అతడికి సుమారు 60 సంవత్సరాల వయసు ఉంటుందట. శరీరానికి పక్షుల ఈకలు కట్టుకుని తిరిగేవాడని చెప్పారు. ఇతడి మృతితో ఈ తెగ పూర్తిగా అంతరించిపోయిందని అధికారులు పేర్కొన్నారు.

నా మెసేజ్‌లకు రిప్లై ఎందుకు ఇవ్వలేదంటూ యువకుడి ప్రశ్న.. చివరకు స్నేహితులతో కలిసి నేరుగా వెళ్ళిన ప్రియుడు..

Updated Date - 2022-08-31T21:28:15+05:30 IST

Read more