Sad incident: స్టేజిపై డాన్స్ చేస్తున్న పార్వతి వేషధారి... అంతా చూస్తుండగా సడన్‌గా ఊహించని ఘటనతో..

ABN , First Publish Date - 2022-09-08T22:55:13+05:30 IST

శుభకార్యాలలో అప్పుడప్పుడూ అశుభం జరగడం చూస్తుంటాం. దీంతో అప్పటివరకూ ఆనందకరంగా సాగిన కార్యక్రమాలు.. ఒక్కసారిగా విషాదాంతం అవుతుంటాయి. అదేవిధంగా..

Sad incident: స్టేజిపై డాన్స్ చేస్తున్న పార్వతి వేషధారి... అంతా చూస్తుండగా సడన్‌గా ఊహించని ఘటనతో..

శుభకార్యాలలో అప్పుడప్పుడూ అశుభం జరగడం చూస్తుంటాం. దీంతో అప్పటివరకూ ఆనందకరంగా సాగిన కార్యక్రమాలు.. ఒక్కసారిగా విషాదాంతం అవుతుంటాయి. అదేవిధంగా అప్పటివరకూ అందరినీ అలరించే కళాకారులు.. అనుకోకుండా మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. స్టేజిపై పార్వతి వేషధారి డాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో  అంతా చూస్తుండగా ఒక్కసారిగా ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అయ్యో ఎంత ఘోరం జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.


దేశంలోని పలు ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు (Vinayaka Chavithi Festival) ఘనంగా జరుగుతున్నాయి. జమ్మూలో (Jammu) నిర్వహించిన వేడుకలు చివరకు విషాదాంతం అయ్యాయి. యోగేష్ గుప్తా(20) అనే వ్యక్తి.. పార్వతి వేషధారణలో డాన్స్ చేస్తుంటాడు. కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రజలు.. చప్పట్లతో మారుమోగిస్తుంటారు. ఈ క్రమంలో వేగంగా డాన్స్ చేస్తున్న యోగేష్.. ఒక్కసారిగా కిందపడిపోతాడు. చాలా సేపు ఉలుకూపలుకూ లేకుండా అలాగే ఉండిపోతాడు. కార్యక్రమంలో భాగంగా ఇలా చేశాడేమో అని అంతా అనుకుంటారు. అయితే ఎంత సేపటికీ అతను పైకి లేవకపోవడంతో పక్కనే ఉన్న శివుడి పాత్రధారికి అనుమానం కలుగుతుంది. వెంటనే అతడి వద్దకు వెళ్లి.. పైకి లేపేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అప్పటికే అతను అపస్మారక స్థితికి చేరుకుని ఉంటాడు. దీంతో అంతా కలిసి కంగారుగా అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తారు. పరీక్షించిన వైద్యులు.. యోగేష్.. గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అయ్యో! ఎంత ఘోరం జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: డాగ్ షోకు వచ్చిన చిన్నారిని చూసి చలించిపోయిన జడ్జి.. చివరకు బాలిక కుక్కను చూసి.. అంతా అయ్యో పాపం..! అంటూ..





Updated Date - 2022-09-08T22:55:13+05:30 IST

Read more