Viral News: 26ఏళ్ల యువకుడు.. రాత్రిళ్లు నిద్రపోకుండా అదే పనిగా అలా చేశాడు.. వారం రోజుల తర్వాత!

ABN , First Publish Date - 2022-12-15T11:42:17+05:30 IST

ఒకప్పుడు పగలంతా పని చేసి, రాత్రి వేళలో పడుకుని విశ్రాంతి తీసుకునే వారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొందరు పగలంతా పని చేసి వచ్చిన తర్వాత..

Viral News: 26ఏళ్ల యువకుడు.. రాత్రిళ్లు నిద్రపోకుండా అదే పనిగా అలా చేశాడు.. వారం రోజుల తర్వాత!

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు పగలంతా పని చేసి, రాత్రి వేళలో పడుకుని విశ్రాంతి తీసుకునే వారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొందరు పగలంతా పని చేసి వచ్చిన తర్వాత కూడా పలు రకాల కారణాలతో రాత్రి కంటి నిండా నిద్రపోవడం లేదు. అయితే అటువంటి వాళ్లు జాగ్రత్తగా ఉంటే బెటర్. లేదంటే.. భారీ ముల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. ఇంతకూ విషయం ఏంటంటే..

అతడి పేరు కావో(Cao). చైనా(China)కు చెందిన ఈ 26ఏళ్ల యువకుడు వుహాన్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఉండే ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్న అతడు. ఉదయాన్నే డ్యూటీకి వెళ్లి.. సాయంత్రం 6 గంటల తర్వాతే ఇంటికి తిరిగొస్తాడు. ఇలా ఉద్యోగంలో పడి బిజీ లైఫ్‌ను గడుపుతున్న అతడు.. తన లైఫ్‌ను మరింత బిజీగా మార్చుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో.. రాత్రి వేళలో నిద్ర పోవడాన్ని తగ్గించి మ్యాచ్‌లు చూడటం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రాత్రి వేళలలో నిద్ర పోవడమే మానేశాడు. తెల్లారి ఆరు గంటల వరకు టీవీ/ల్యాప్‌టాప్‌లో మ్యాచ్‌లు చూసి ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లడం మొదలెట్టాడు. అలా వారం రోజులు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో అతడు తన ముఖంలో మార్పులు రావడాన్ని గమనించాడు. పెదాలు ఒకవైపు తిరిగి పోవడం, కంటి రెప్పలు వాల్చేందుకు కూడా కష్టమనిపించడంతో డాక్టర్‌ను సందప్రదించాడు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అతడి ముఖానికి పక్షవాతం(Paralyzed on Face) వచ్చినట్టుగా గుర్తించారు. అదే విషయాన్ని అతడికి వెల్లడించారు. దీంతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. రాత్రి వేళలో నిద్రపోకుండా గడిపే వారికి ఇటువంటి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెప్పారు. అయితే ప్రస్తుతం కావో‌కు చికిత్స ప్రారంభించినట్టు వెల్లడించారు. అతడి పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని చెప్పారు.

Updated Date - 2022-12-15T11:46:20+05:30 IST