తండ్రి, అన్నపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన బాలిక.. రెండేళ్లుగా వారు చేసిన పని తెలుసుకుని.. చివరకు..

ABN , First Publish Date - 2022-01-21T02:02:50+05:30 IST

ముంబైలోని ధారావి ప్రాంతానికి చెందిన ఓ బాలిక(16) కళాశాలకు వెళ్లి తమ ప్రిన్సిపాల్‌ను కలిసింది. తన తండ్రి, అన్న గురించి ఫిర్యాదు చేయడంతో మొదట ఎవరికీ అర్థం కాలేదు. చివరగా బాలిక చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు...

తండ్రి, అన్నపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన బాలిక.. రెండేళ్లుగా వారు చేసిన పని తెలుసుకుని.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

పాఠశాలలు, బయటి ప్రాంతాల్లో బాలికలకు సమస్యలు ఎదురైనప్పుడు.. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేస్తుంటారు. కొందరు విద్యార్థినులు తండ్రితో చెప్పలేని సమస్యలను అన్నకు చెప్పుకొంటారు. తండ్రి తర్వాత తండ్రిలా చూసుకునే అన్న అంటే ప్రతి ఆడపిల్లకు అంత అభిమానం ఉంటుంది. అయితే తండ్రి, అన్న నుంచే సమస్యలు ఎదురైతే.. ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ముంబైలో ఓ బాలికకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తండ్రి, అన్నపై ఓ బాలిక కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. చివరికి అసలు విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు.


ముంబైలోని ధారావి ప్రాంతానికి చెందిన ఓ బాలిక(16) కళాశాలకు వెళ్లి తమ ప్రిన్సిపాల్‌ను కలిసింది. తన తండ్రి, అన్న గురించి ఫిర్యాదు చేయడంతో మొదట ఎవరికీ అర్థం కాలేదు. చివరగా బాలిక చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు. రెండేళ్లుగా తండ్రి, అన్న తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. 2019 జనవరిలో తాను ఇంట్లో నిద్రిస్తుండగా అన్న లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది. కొన్నళ్ల తర్వాత ఓ రోజు తాను ఓ ప్లాస్టిక్ బ్యాగుల కంపెనీలో పని చేస్తుండగా.. తండ్రి కూడా తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బోరున విలపించింది. అప్పటి నుంచి తండ్రి, అన్న తరచూ తనపై లైంగికదాడికి పాల్పడుతున్నారని చెప్పింది.

ఇంట్లోకి దొంగ దూరాడంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు.. గదిలో షాకింగ్ దృశ్యం.. అసలు కథేంటో తెలిసి..


ఇన్నాళ్లు ఓపికతో భరించానని, అయితే ఇటీవల చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయని తెలిపింది. తనకు న్యాయం చేయాలని ప్రిన్సిపాల్‌ను వేడుకుంది. అనంతరం బాలికకు జరిగిన అన్యాయం గురించి ప్రిన్సిపాల్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గత సోమవారం నిందితులను అరెస్ట్ చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన అనంతరం వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. బాలికపై స్వయానా తండ్రి, అన్న అత్యాచారానికి పాల్పడడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రియురాలి కోసం రూ.4కోట్ల రింగ్ తీసుకున్నాడు.. ఇవ్వడానికి కాస్త ముందే ఆమె గురించి తెలిసి.. హమ్మయ్య అనుకున్నాడు..

Updated Date - 2022-01-21T02:02:50+05:30 IST