అమ్మాయిని ‘ఐటెమ్’ అని పిలుస్తున్నారా.. పొరపాటున నోరు జారితే.. ఇక మీరు చిక్కుల్లో పడ్డట్టే.. కావాలంటే ఇది చదవండి..

ABN , First Publish Date - 2022-10-25T18:02:44+05:30 IST

రోడ్డుపై ఒంటిరిగా కనిపించే బాలికలు, యువతులు, మహిళలకు.. ఆకతాయిల నుంచి నిత్యం వేధింపులు ఎదురవుతుంటాయి. అసభ్య పదజాలంతో కామెంట్ చేయడం, ఎదురు ప్రశ్నిస్తే దాడులు చేయడం చేస్తుంటారు. ఇలాంటి వారికి ఎన్ని శిక్షలు వేసినా.. మార్పు మాత్రం రావడం లేదు. కొందరు జులాయిలైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారికి బుద్ధి వచ్చేలా ..

అమ్మాయిని ‘ఐటెమ్’ అని పిలుస్తున్నారా.. పొరపాటున నోరు జారితే.. ఇక మీరు చిక్కుల్లో పడ్డట్టే.. కావాలంటే ఇది చదవండి..
Mumbai Special POCSO Court

రోడ్డుపై ఒంటిరిగా కనిపించే బాలికలు, యువతులు, మహిళలకు.. ఆకతాయిల నుంచి నిత్యం వేధింపులు ఎదురవుతుంటాయి. అసభ్య పదజాలంతో కామెంట్ చేయడం, ఎదురు ప్రశ్నిస్తే దాడులు చేయడం చేస్తుంటారు. ఇలాంటి వారికి ఎన్ని శిక్షలు వేసినా.. మార్పు మాత్రం రావడం లేదు. కొందరు జులాయిలైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారికి బుద్ధి వచ్చేలా ముంబై కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అమ్మాయిని ‘‘ఐటెమ్’’ అని పిలిచిన ఓ వ్యక్తికి శిక్ష విధిస్తూ తీర్పు (court latest judgment) ఇచ్చింది. వివరాల్లోకి వెళితే...

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు (Mumbai Special POCSO Court) ఇటీవల తీర్పు ఇచ్చింది. 2015లో 16ఏళ్ల ఓ బాలిక పాఠశాలకు వెళ్తోంది. ఆ సమయంలో స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. ఆమెను వేధించాడు. ‘‘ఐటెమ్’’.. అని పిలుస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. దీనిపై బాలిక ఆగ్రహం వ్యక్తం చేయడంతో జుట్టు పట్టుకుని లాగాడు. అలాగే అసభ్యపదజాలతో దుర్భాషలాడాడు. దీంతో బాలిక 100కి కాల్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరకి.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

తర్వాత బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై ఇటీవల ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు అమ్మాయిని ‘‘ఐటెమ్’’ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొంది. వాదోపవాదాల అనంతరం నిందితుడికి ఒకటిన్నర సంవత్సరాల జైలు శిక్ష (Imprisonment) విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇదిలావుండగా, కావాలనే తప్పుడు కేసులు నమోదు చేశారని నిందితుడి తరపు లాయర్ వాదించారు. బాలిక తల్లిదండ్రులకు నిందితుడిపై కక్ష ఉందని, అందుకే ఇలాంటి కుట్రకు తెర తీశారని ఆరోపించారు. అయితే దీనిపై ఎలాంటి సాక్ష్యాలూ లేకపోవడంతో కోర్టు ఈ వాదనలను కొట్టివేసింది.

Updated Date - 2022-10-25T18:02:50+05:30 IST