తల్లీకొడుకు స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.. కొడుకు ఇంటి గుమ్మం మెట్టుదిగాడు.. అంతలో హఠాత్పరిణామం.. వీడియో చూడాల్సిందే!

ABN , First Publish Date - 2022-08-14T14:42:03+05:30 IST

తల్లీకొడుకు స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.. కొడుకు ఇంటి గుమ్మం మెట్టుదిగాడు.. అంతలో హఠాత్పరిణామం.. వీడియో చూడాల్సిందే!

తల్లీకొడుకు స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.. కొడుకు ఇంటి గుమ్మం మెట్టుదిగాడు.. అంతలో హఠాత్పరిణామం.. వీడియో చూడాల్సిందే!

కర్ణాటకలోని మాండ్యాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ తల్లి తన కొడుకును నాగుపాము నుంచి కాపాడింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఆ ఇంటి సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తల్లి తన కొడుకును స్కూల్లో దింపేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మద్దూరులోని వైద్యనాథ్‌పూర్‌ రోడ్డు పక్కన ఒక ఇంటి బయట పొడవాటి నాగు పాము పాకుతోంది. ఇంతలో లోపలి నుంచి కొడుకుని తీసుకుని తల్లి బయటికి వచ్చింది. 

పిల్లవాడు ముందుగా మెట్టు దిగాడు. అంతే అక్కడున్న పాము బుస్సుమంటూ పడగవిప్పి పైకి లేచింది. అయితే ఆ పాము తన కుమారునిపై దాడి చేయకముందే తల్లి అతడిని పక్కకు లాగింది. కొంచెం ఆలస్యం జరిగినా ఆ నాగుపాము పిల్లవాడిని కాటువేసేది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోను చూసినవారంతా నిర్ఘాంతపోతున్నారు. ఆ కుర్రాడి తల్లి వెంటనే స్పందించడాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. 

Updated Date - 2022-08-14T14:42:03+05:30 IST