Attack on girl: ఆలయం నుంచి వస్తున్న బాలిక వెనుకే వెళ్లాడు.. మర్కెట్ దగ్గరికి రాగానే వెనుక వైపు నుంచి ఒక్కసారిగా..

ABN , First Publish Date - 2022-08-19T21:35:59+05:30 IST

ప్రేమను అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. బాలికలు, యువతుల విషయంలో ఒక్కోసారి సమస్యలు ఎదురవుతుంటాయి. ప్రేమించలేదని కొందరు, ప్రేమించినా పెళ్లి చేసుకోలేదని..

Attack on girl: ఆలయం నుంచి వస్తున్న బాలిక వెనుకే వెళ్లాడు.. మర్కెట్ దగ్గరికి రాగానే వెనుక వైపు నుంచి ఒక్కసారిగా..

ప్రేమను అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. బాలికలు, యువతుల విషయంలో ఒక్కోసారి  సమస్యలు ఎదురవుతుంటాయి. ప్రేమించలేదని కొందరు, ప్రేమించినా పెళ్లి చేసుకోలేదని కొందరు.. యువతులపై దాడులు చేయడం రోజూ చూస్తూనే ఉన్నాం. గుజరాత్‌లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 46 ఏళ్ల ఓ వ్యక్తి.. 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఓ రోజు లవ్ ప్రపోజ్ చేశాడు. కానీ బాలిక మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అయినా ఆమెనే ఫాలో అవుతుండేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఆలయం నుంచి వస్తున్న బాలిక వెనుకే వెళ్లాడు. తీరా మార్కెట్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనకు (tragic incident) సంబంధించిన వివరాల్లోకి వెళితే..


గుజరాత్ (Gujarat) రాష్ట్రం ఖేడా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధికి చెందిన 16ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతోంది. అప్పుడప్పుడూ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో స్నేహితురాలి మేనమామ అయిన 46 ఏళ్ల రాజేష్ పటేల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రాజేష్ పటేల్.. రోజూ బాలికను గమనిస్తూ ఉండేవాడు. ఇటీవల ఓ రోజు ఆమె వద్దకు వెళ్లి.. లవ్ ప్రపోజ్ చేశాడు. అయితే ఇందుకు బాలిక నిరాకరించింది. అప్పటి నుంచి అతడి ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లడం మానేసింది. అయినా రాజేష్ మాత్రం.. బాలిక వెంట పడుతుండేవాడు. ఎలాగైనా తనను ప్రేమించాలంటూ వేధిస్తుండేవాడు. అయితే బాలిక మాత్రం అతడితో మాట్లాడేది కాదు. దీంతో ఆమెపై పగ పెంచుకున్నాడు.

గ్రామం ఖాళీ చేసిన యువకుడి కుటుంబం.. విషయం తెలిసి వీడియో రిలీజ్ చేసిన యువతి.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బాలిక తన స్నేహితులతో కలిసి ఆలయానికి వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో రాజేష్.. ఆమెను ఫాలో అవుతూ వచ్చాడు. సమీపంలోని మార్కెట్ వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి వెళ్లి ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు కడుపులో పొడవడంతో పాటూ గొంతు నులిమేశాడు. స్థానికులు గమనించి నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలికను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని ఉరి తీయాలంటూ బాలిక కుంటుబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఆరు నెలల క్రితం అస్వస్థతకు గురైన భర్త.. ఇటీవల చెల్లెలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన భార్య.. చివరకు చేసిన పని..Read more