Viral Video: ఫోన్ మాయలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. టైం బాగుండి సరిపోయింది..
ABN , First Publish Date - 2022-02-07T03:16:26+05:30 IST
ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. ఫోన్ పిచ్చిలో పడి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. అదృష్టం బాగుండి ఏమీ కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ప్రస్తుత ప్రపంచంలో ఫోన్ లేనిది పని అవడం లేదు. కొందరైతే గంటలు గంటలు ఫోన్లలోనే గడుపుతుంటారు. సెల్ చేతిలో ఉంటే బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. మరికొందరు సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చూశాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. ఫోన్ పిచ్చిలో పడి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. అదృష్టం బాగుండి ఏమీ కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఢిల్లీలోని షాహదారా మెట్రో స్టేషన్లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఓ వ్యక్తి ఫోన్ చూస్తూ నడుస్తూ ఉన్నాడు. ముందు గమనించకుండా ఫోన్లో చూసుకుంటూ వెళ్తూ రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది గమనించారు. ఓ వ్యక్తి వెంటనే అతడి వద్దకు వెళ్లి సాయం చేశాడు. అదే సమయంలో ఏదైనా రైలు వచ్చి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.