-
-
Home » Prathyekam » A husband killed his wife in front of their daughter on the suspicion of extra marital affair kjr spl-MRGS-Prathyekam
-
7ఏళ్ల కూతురి ఎదుటే తండ్రి చేసిన నిర్వాకం.. ఘటన జరిగిన కాసేపటికే అతను తీసుకున్న అనూహ్య నిర్ణయంతో..
ABN , First Publish Date - 2022-08-25T00:52:29+05:30 IST
వారిద్దరికీ పదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వారికి ఏడేళ్ల కూతురు కూడా ఉంది. హాయిగా సాగుతున్న వీరి కుటుంబంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. భార్యపై అనుమానం..

వారిద్దరికీ పదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వారికి ఏడేళ్ల కూతురు కూడా ఉంది. హాయిగా సాగుతున్న వీరి కుటుంబంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. చివరకు సంసారాన్ని సమస్యలకు నిలయంగా మార్చాడు. రోజూ ఏదో ఒక చూపి గొడవ చేస్తుండేవాడు. ఓ రోజు కూతురు ఎదుటే.. దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కాసేపటికే అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. దీంతో చివరకు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే...
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం జంజ్‌గిర్-చంపా పరిధి అమ్లిదిహ్ గ్రామానికి చెందిన మనోజ్ బరేత్ అనే వ్యక్తికి రామ్‌షీలా(34) అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం 7ఏళ్ల కుమార్తె ఉంది. సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. ఇటీవల మనోజ్ బరేత్.. తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. నాకు తెలీకుండా వేరే వారితో వివాహేతర సంబంధం (Extramarital affair) పెట్టుకున్నావంటూ.. రోజూ భార్యను వేధించేవాడు. ఇటీవల గొడవలు మరింత ఎక్కువయ్యాయి. మంగళవారం రాత్రి కూడా వారి మధ్య ఇదే విషయమై గొడవ మొదలైంది.
అప్పటిదాకా ఆడుకుంటున్న బాలిక.. ఆ మరుక్షణమే అపస్మారక స్థితిలో.. నోటికి ఖర్చీప్ అడ్డుపెట్టి మరీ చివరకు..

ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. పదునైన ఆయుధంతో కూతురి ఎదుటే తల్లిని హత్య చేశాడు. తర్వాత కాసేపటికి ఊరి వెలుపల ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల మృతితో చివరకు అనాథగా మారిన బాలికను చూసి.. గ్రామస్తులు అయ్యో పాపం అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు.