Drunk Teacher: మందు కొట్టి స్కూల్‌కు వెళ్లిన లేడీ టీచర్.. క్లాస్‌లో స్పృహ తప్పి పడి ఉన్న ఆమెను చూసిన అధికారులు ఏం చేశారంటే..
ABN , First Publish Date - 2022-07-25T00:35:55+05:30 IST
ఆమె ఒక ఉపాధ్యాయురాలు.. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉంది
ఆమె ఒక ఉపాధ్యాయురాలు (female teacher) .. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉంది.. అలాంటి ఆమె గురువు అనే పేరుకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది.. మద్యం సేవించి పాఠశాల (school)కు హాజరైంది.. పాఠాలు చెప్పకుండా నేలపై స్పృహ తప్పి పడిపోయింది.. విద్యార్థులు ఆమె చుట్టూ చేరి ఆడుకుంటున్నారు.. స్కూల్ తనిఖీకి వచ్చిన విద్యాశాఖ అధికారి ఆమెను ఆ స్థితిలో చూసి షాకయ్యారు.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని జష్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Heart touching video: డ్యాన్స్ చేస్తూ పడిపోయిన యువతి.. ఆ తర్వాత ఆమె తండ్రి ఏం చేశాడంటే.. ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో!
ఛత్తీస్‌గఢ్‌లోని చాలా పాఠశాలల టీచర్లు మద్యం సేవించి క్లాసులకు హాజరవుతున్నారని తరచుగా విద్యాశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ అధికారి సిద్ధిక్ రోటీన్ తనిఖీలో భాగంగా ఒక పాఠశాలకు వెళ్లారు. ఆ సమయంలో లేడీ టీచర్ జగపతి భగత్ ఓ తరగతి గదిలో నేలపై పడుకుని ఉంది. తొలుత ఆమెకు ఆరోగ్యం బాగోలేదేమోనని విద్యాశాఖ అధికారి అనుకున్నారు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. క్లాస్‌లో ఆడుకుంటున్న విద్యార్థులను అడగ్గా, టీచర్ తాగి వచ్చిందని చెప్పారు.
కొన్ని రోజులుగా ఆమె మద్యం సేవించి స్కూల్‌కు వస్తోందని విద్యార్థులు, గ్రామస్తులు తెలిపారు. దీంతో విద్యాశాఖ అధికారి వెంటనే స్థానిక పోలీస్ అధికారికి ఫిర్యాదు చేశారు. సదరు మహిళా ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జూన్ 16న ప్రారంభమైన ఈ విద్యా సంవత్సరంలో జష్పూర్ జిల్లాలోనే ఇప్పటి వరకు ఐదుగురు ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. అందులో ముగ్గురు టీచర్లు మద్యం తాగి స్కూల్‌కు రావడం వల్లే సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే ఓ మహిళా ఉపాధ్యాయురాలు మద్యం సేవించి దొరికిపోవడం మాత్రం ఇదే ప్రథమం.