-
-
Home » Prathyekam » a fake Baba in the name of Poojas has been abusing a young woman for five years In Bengaluru kjr spl-MRGS-Prathyekam
-
తీర్థం తీసుకోగానే మూర్ఛపోతున్న యువతి.. ఐదేళ్ల అనంతరం పెళ్లి ప్రయత్నాలు చేస్తుండగా.. అసలు విషయం తెలిసి..
ABN , First Publish Date - 2022-08-25T22:34:00+05:30 IST
ఆ యువతి తీవ్ర మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతోంది. వివాహం కాకపోవడంతో పాటూ ఆర్థిక సమస్యలు ఆమెను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలా.. అని..

ఆ యువతి తీవ్ర మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతోంది. వివాహం కాకపోవడంతో పాటూ ఆర్థిక సమస్యలు ఆమెను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలా.. అని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తెలిసిన వారు ఓ సలహా ఇచ్చారు. దీంతో ఆ యువతి ఓ స్వామీజీని ఆశ్రయించింది. అతడు ఇచ్చిన తీర్థం తీసుకోగానే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఐదేళ్లుగా ఇదే జరుగుతున్నా అసలు విషయం ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఇటీవల యువతికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు విషయం తెలిసి.. అంతా షాక్ అయ్యారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బెంగుళూరులోని (Bangalore) అవలహళ్లి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ యువతి.. చాలా సంవత్సరాలుగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండేది. వివాహం కాకపోవడంతో పాటూ ఆమెకు ఆర్థిక సమస్యలు కూడా తోడయ్యాయి. దీంతో ఎలాగైనా కష్టాల నుంచి బయటపడాలని ఎందరో దేవుళ్లకు మొక్కుకుంటూ ఉండేది. ఈ క్రమంలో స్నేహితురాలు సలహా మేరకు.. ఆశ్రమంలో ఉంటున్న బాబా వద్దకు వెళ్లింది. తన సమస్యలను అతడికి వివరించింది. కష్టాల నుంచి గట్టెక్కిస్తానని చెప్పి.. ముందుగా ఆమెకు తీర్థం ఇచ్చాడు. అది తాగిన కాసేపటికి అపస్మారక స్థితిలోకి (unconsciousness) వెళ్లింది. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
భర్తతో విడిపోయి దూరంగా ఉంటోందని తెలుసుకుని పక్కా ప్లాన్.. ఇంటి వద్ద విడిచిపెడతామంటూ కారులో ఎక్కించుకుని..
ఆ సమయంలో దొంగ స్వామి భార్య.. ఫోన్‌లో వీడియోలు తీస్తూ ఉండేది. ఇలా చాలా సంవత్సరాలుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల ఓ రోజు బాధితురాలు.. ఈ విషయంపై స్వామీజీని నిలదీసింది. యువతి కుటుంబ సభ్యులు ఆమెకు ఇటీవల పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దొంగ బాబా.. ఆమెతో దిగిన అశ్లీల ఫొటోలు, వీడియోలను పంపించాడు. తననే పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించాడు. ఆగస్టు 23న బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు. పూజల పేరుతో దొంగ బాబా పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.